ఒడిషాలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా మరో 143..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే రెండు లక్షల మార్క్‌ను దాటేసింది. పెరుగుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు కేసులు నమోదవుతున్నాయి. అయితే మొన్నటి వరకు వెయ్యి లోపు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. తాజాగా ఒడిషాలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు వేలకు చేరువలో ఉంది. బుధవారం నాడు కొత్తగా మరో 143 కరోనా పాజిటివ్ […]

ఒడిషాలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా మరో 143..
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2020 | 7:10 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే రెండు లక్షల మార్క్‌ను దాటేసింది. పెరుగుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు కేసులు నమోదవుతున్నాయి. అయితే మొన్నటి వరకు వెయ్యి లోపు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. తాజాగా ఒడిషాలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు వేలకు చేరువలో ఉంది. బుధవారం నాడు కొత్తగా మరో 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,388కి చేరింది. వీటిలో ప్రస్తుతం 1054 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. బుధవారం నాడు 80 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఒడిషా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,325కి చేరిందని పేర్కొంది. ఇక కరోనా బారినపడి 7 మంది మరణించారని.. ఇక మరో ఇద్దరు ఇతర కారణాలతో మరిణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.