TV9 Salutes Nurses : కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరులో నర్సులు కీలక పాత్ర పోషిస్తున్నారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనాపై పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా నిలుస్తున్నారు. ఈ పోరాటంలో చాలా మంది నర్సులు తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. కొవిడ్ వార్డులకు కుటుంబ సభ్యులను అనుమతించే పరిస్థితి లేకపోవడంతో రోగుల పాలట అన్నీ తామై సేవలందిస్తున్నారు.
తాజాగా అనంతపూర్ లో క్యాన్సర్ హాస్పిటల్‌లో విధులు నిర్వర్తిస్తున్న స్టాఫ్ నర్స్ ప్రీతీ & ఎఫ్.ఎం.ఓ నాగవేణి కరోనా పేషెంట్‌కు భోజనం తినిపిస్తూ మానవత్వాన్ని చాటారు. కుటుంబ సభ్యులు ఎవ్వరు లేకపోయినా మేము ఉన్నాం అంటూ భరోసా కల్పించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. చాలామంది మరణిస్తున్నారు. ఇటువంటి ఆపద సమయంలో నర్సులు తమ ప్రాణాలను పనంగా పెట్టి సేవలందిస్తున్నారు. సమయ పాలన లేకుండా, కుటుంబాలు విడిచి రోజుల తరబడి ఆస్పత్రులలో గడుపుతున్నారు. ఇలా కొవిడ్ రోగులకు మహోన్నతమైన సేవలు అందిస్తున్న నర్సులకు టీవీ9 సెల్యూట్ చేస్తోంది.