ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..ఇవాళ ఒక్కరోజే…
కొత్తగా వచ్చిన కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2452కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,092 మంది సాంపిల్స్ పరీక్షించగా..

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 41 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒకరు మృతిచెందగా, ..రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 54కి చేరింది. కొత్తగా వచ్చిన కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2452కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,092 మంది సాంపిల్స్ పరీక్షించగా 45 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా కొత్తగా 41 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1680కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 718 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
