AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ కరోనా ఉధృతి..సడలింపులకు నో చెప్పిన సీఎం

లాక్‌డౌన్ తో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలుతున్నప్పటికీ వైరస్ చైన్ మాత్రం తెంచలేకపోతున్నామని తెలిపారు. కరోనా కేసుల సంఖ్య తగ్గి, పరిస్థితి కాస్తా అదుపులోకి వచ్చేంత వరకు లాక్‌డౌన్ కఠిన నిబంధనలు పాటించక తప్పదని స్పష్టం చేశారు.

అక్కడ కరోనా ఉధృతి..సడలింపులకు నో చెప్పిన సీఎం
Jyothi Gadda
|

Updated on: May 19, 2020 | 12:29 PM

Share

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,01,139 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా.. 3,163 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 4,970 కేసులు నమోదు కాగా, 134 మంది వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం భారత్‌లో 58,802 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 39,173 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా లక్ష దాటిన దేశాల జాబితాలో భారత్ 11వ స్థానంలో నిలిచింది. కాగా, దేశంలోనే అత్యధిక కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు, గుజరాత్ ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. దీంతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో వైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకూ రికార్డు స్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్రంలో 2వేల మార్క్ దాటి కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో కేంద్రం ప్రకటించిన సడలింపులకు ఉద్ధవ్ ససేమిరా అంటున్నారు. లాక్‌డౌన్ తో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలుతున్నప్పటికీ వైరస్ చైన్ మాత్రం తెంచలేకపోతున్నామని తెలిపారు. కరోనా కేసుల సంఖ్య తగ్గి, పరిస్థితి కాస్తా అదుపులోకి వచ్చేంత వరకు లాక్‌డౌన్ కఠిన నిబంధనలు పాటించక తప్పదని స్పష్టం చేశారు. రాష్ట్రాలలో లౌక్‌డౌన్ నిబంధనల సడలింపు అంశాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిన నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఈ నిర్ణయం ప్రకటించారు.

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..