Corona: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. మళ్లీ 10వేల మార్క్ దాటిన కేసులు..

Maharashtra Coronavirus Updates: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. గత కొన్నిరోజుల నుంచి పెరుగుతున్న కరోనా కేసులతో ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం..

Corona: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. మళ్లీ 10వేల మార్క్ దాటిన కేసులు..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 05, 2021 | 10:36 PM

Maharashtra Coronavirus Updates: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. గత కొన్నిరోజుల నుంచి పెరుగుతున్న కరోనా కేసులతో ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నమోదైన కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. గత కొంతకాలంగా పదివేలకు తక్కువగా నమోదైన కేసులు కాస్త.. మళ్లీ ఆ మార్క్ దాటాయి. గత 24 గంటల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 10,216 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మహారాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఒక్కరోజులో 53 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 6,467 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముంబయి మహా నగరంలో 1,173 కేసులు నమోదు కాగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా నమోదైన కేసుల ప్రకారం.. ఇప్పటివరకు 21,98,399 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మహమ్మారి కారణంగా 52,393 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి 20,55,951 మంది కోలుకొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 88,838 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో రికవరీ రేటు 93.52 శాతంగా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,66,86,880 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

కాగా.. దేశంలో కొత్తగా పెరుగుతున్న కరోనా కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లోనే 85 శాతానికి పైగా కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది.. మరోవైపు కేసులు కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వం పలు రాష్ట్రాలకు సూచనలు సైతం చేస్తోంది.

Also Read:

స్టెప్పులేసిన మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా.. జతకలిసిన పంజాబ్ సీఎం అమరీందర్.. వీడియో వైరల్

Heranba Industries: మార్కెట్‌లో దూసుకుపోతున్న హెరన్బా ఇండస్ట్రీస్.. ఒక్కసారిగా షేర్ ధర ఎంత పెరిగిందంటే..?

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!