మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. ఇప్పటికే 5 లక్షల మార్క్‌ దాటిన సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా..

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2020 | 4:34 AM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. ఇప్పటికే 5 లక్షల మార్క్‌ దాటిన సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 12,248 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,15,332కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 3,51,710 ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,45,558 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్టర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 17,757 మంది మరణించారు. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా ముంబై, పూణె నగరాల్లోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే రెండు నగరాల్లో కూడా లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 13,348 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Read More :

కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా

తమిళనాడులో 3 లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులు