AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక డెడ్‌బాడీస్‌కు కోవిడ్ పరీక్షలు బంద్.. మహా ప్రభుత్వ నిర్ణయం..

మృతదేహాలకు కోవిడ్ పరీక్షలు బంద్ చేయాలని మహా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కరోనా వైరస్ అనుమానిత డెడ్‌బాడీస్‌కు పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. మృతదేహాలకు చేసే టెస్టుల్లో సుధీర్ఘ సమయం తీసుకుంటున్న నేపథ్యంలో అంత్యక్రియలు జరపడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ..

ఇక డెడ్‌బాడీస్‌కు కోవిడ్ పరీక్షలు బంద్.. మహా ప్రభుత్వ నిర్ణయం..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 20, 2020 | 12:07 PM

Share

మృతదేహాలకు కోవిడ్ పరీక్షలు బంద్ చేయాలని మహా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కరోనా వైరస్ అనుమానిత డెడ్‌బాడీస్‌కు పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. మృతదేహాలకు చేసే టెస్టుల్లో సుధీర్ఘ సమయం తీసుకుంటున్న నేపథ్యంలో అంత్యక్రియలు జరపడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ మృతుల బంధువులు చేస్తోన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. కరోనా అనుమానిత మృతదేహాలన్నింటికీ పరీక్షలు నిర్వహించే ప్రక్రియను రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జరీ చేసింది. మృతుల కాంటాక్ట్స్ ఆధారంగా కరోనా ఫలితాలను కనుక్కుంటామని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రదీప్ వ్యాస్ పేర్కొన్నారు. కంటైన్‌మెంట్ జోన్‌లో ఉంటూ మరణించి, కరోనా లక్షణాలు ఉన్న వారి మృతదేహాలకు మాత్రమే పరీక్షలు చేస్తామని స్పష్టం చేశారు. రిపోర్టులు వచ్చేంత వరకూ ఆగకుండా వైరస్ అనుమానితుల డెడ్‌బాడీలను వారి కుటుంబ సభ్యులకు వెంటనే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించటం వల్ల తప్పుడు ఫలితాలు వచ్చే ఆస్కారం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Read More: ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌నం.. అప్లై చేసిన ప‌ది పనిదినాల్లో పెన్ష‌న్…

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల