ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణయం.. అప్లై చేసిన 10 పనిదినాల్లో పెన్ష‌న్…

ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసిన పది పనిదినాల్లో పెన్షన్ మంజూరు చేస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దేశంలోనే తొలిసారిగా నిర్ధిష్ట కాలపరిమితిలో ప్రభుత్వ సేవలు అందించాలని, పాలనలో కొత్త విప్లవానికి...

ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణయం.. అప్లై చేసిన 10 పనిదినాల్లో పెన్ష‌న్...
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2020 | 12:20 PM

ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్టటిన జగన్.. ఏడాది కాలంలోనే పలు సంచలన నిర్ణయాలు, సంక్షేమ పథకాలతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే అర్హులైన వారికి నూతన పెన్షన్‌లను దరఖాస్తు చేసిన పది పని దినాల్లోనే అందించనున్నారు. దరఖాస్తు చేసిన పది పనిదినాల్లో పెన్షన్ మంజూరు చేస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దేశంలోనే తొలిసారిగా నిర్ధిష్ట కాలపరిమితిలో ప్రభుత్వ సేవలు అందించాలని, పాలనలో కొత్త విప్లవానికి నాంది పలికింది ఏపీ ప్రభుత్వం.

కాగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త దరఖాస్తుదారులకు పెన్షన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. జిల్లాల వారీగా పెన్షనర్లకు కార్డులను అందచేస్తామన్నారు అధికారులు. ఈ నెల1 నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తు చేసిన వారిలో 96,568 మంది అర్హులుగా తేల్చారు. వారికి పది పనిదినాల్లో ప్రభుత్వ సేవలు అందించాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు.. ఇవాళ పెన్షన్ కార్డులను జారీ చేశారు. కాగా తిరస్కరించిన దరఖాస్తులకు నిర్ధిష్టంగా కారణాలు వెల్లడిస్తామన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ సేవలు అందించడంలో బాధ్యత పెరిగిందని, ప్రజలు దరఖాస్తు చేసిన 10 పని దినాల్లో పెన్షన్లు మంజూరు చేస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు.