AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేష‌న్‌కార్డుదారులు కేంద్రం గుడ్‌న్యూస్ ! మ‌రో 3 నెల‌లు…

కరోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప‌థ‌కం కింద రేషన్ కార్డు కలిగిన వారికి గ‌త మూడు నెల‌లుగా ఉచితంగా రేషన్ అందిస్తోంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి ఊరట కలిగించే నిర్ణయం..

రేష‌న్‌కార్డుదారులు కేంద్రం గుడ్‌న్యూస్ ! మ‌రో 3 నెల‌లు…
Jyothi Gadda
|

Updated on: Jun 20, 2020 | 12:48 PM

Share

కరోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప‌థ‌కం కింద రేషన్ కార్డు కలిగిన వారికి గ‌త మూడు నెల‌లుగా ఉచితంగా రేషన్ అందిస్తోంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ కింద కేంద్రం 81 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనాన్ని అంద‌జేస్తోంది. ఈ క్ర‌మంలోనే  కేంద్ర ప్ర‌భుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్‌ను మ‌రో మూడు నెల‌లు పొడిగించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు కేంద్ర‌మంత్రి రామ్‌విలాస్ పాశ్వ‌న్ తెలిపారు. ఉచిత రేషన్ అందించే స్కీమ్‌ను మరో మూడు నెలలు పొడిగించాలని పది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అస్సాం, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, రాజస్తాన్ వంటి పలు రాష్ట్రాలు ఈ మేర‌కు లేఖ రాశాయని వివరించారు. రాష్ట్రాల అభ్యర్థనలను పీఎంవో ఆఫీస్‌కు పంపించామని, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తుందని రామ్ విలాస్ పాశ్వ‌న్ స్ప‌ష్టం చేశారు.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల