లాక్ డౌన్.. ప్రభుత్వం చెప్పింది చేయాల్సిందే.. వెంకయ్యనాయుడు

ఈ నెల 14 తరువాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని, ఏమైనా ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ప్రజలు కట్టుబడి ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ ఇబ్బందులను మరికొంతకాలం భరిద్దాం అని వ్యాఖ్యానించారు. యూపీ, తెలంగాణ, అస్సాం, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు వార్తలు వస్తున్న వేళ.. దీనిపై వెంకయ్య స్పందిస్తూ.. రేపటి రోజున మనం క్షేమంగా ఉండాలంటే ఈ […]

లాక్ డౌన్.. ప్రభుత్వం చెప్పింది చేయాల్సిందే.. వెంకయ్యనాయుడు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 07, 2020 | 3:36 PM

ఈ నెల 14 తరువాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని, ఏమైనా ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ప్రజలు కట్టుబడి ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ ఇబ్బందులను మరికొంతకాలం భరిద్దాం అని వ్యాఖ్యానించారు. యూపీ, తెలంగాణ, అస్సాం, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు వార్తలు వస్తున్న వేళ.. దీనిపై వెంకయ్య స్పందిస్తూ.. రేపటి రోజున మనం క్షేమంగా ఉండాలంటే ఈ సమస్యను మరికొంత కాలం భరిద్దామని పేర్కొన్నారు. లాక్ డౌన్ పై నిర్ణయం విషయంలో వచ్ఛే వారం అతి కీలకమైనదిగా భావించవచ్చు అని ఆయన చెప్పారు. లాక్ డౌన్ అంశంపై ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారని, సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ దానికి కట్టుబడి ఉందామని అన్నారు. ప్రజలు ఇప్పటివరకు చూపిన స్ఫూర్తినే మరికొంతకాలం చూపుతారని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ‘గ్రేడెడ్ ప్లాన్’ తో రావలసిందిగా మోదీ.. తన మంత్రివర్గ సహచరులకు సూచించిన విషయం గమనార్హం.

Latest Articles
ఉన్నట్టుండి వెళ్తున్న కారు అడుగున వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా..
ఉన్నట్టుండి వెళ్తున్న కారు అడుగున వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా..
గిల్‌తో సందడి చేసిన ఈ బ్యూటీఫుల్ లేడీ ఎవరో తెలుసా?
గిల్‌తో సందడి చేసిన ఈ బ్యూటీఫుల్ లేడీ ఎవరో తెలుసా?
రిఫ్రిజిరేటర్‌లో 4 స్టార్- 5 స్టార్ రేటింగ్స్‌ మధ్య తేడా ఏమిటి?
రిఫ్రిజిరేటర్‌లో 4 స్టార్- 5 స్టార్ రేటింగ్స్‌ మధ్య తేడా ఏమిటి?
ఈ యోగాసనాలు వేశారంటే.. వేసవిలో కూడా కూల్‌గా ఉంటారు..
ఈ యోగాసనాలు వేశారంటే.. వేసవిలో కూడా కూల్‌గా ఉంటారు..
కాస్కో నా రాజా.! కేవలం 15 సెకన్లలో ఈ పజిల్ సాల్వ్ చేస్తే..
కాస్కో నా రాజా.! కేవలం 15 సెకన్లలో ఈ పజిల్ సాల్వ్ చేస్తే..
పండితుల ఆశీర్వచనం తీసుకున్న అసదుద్దీన్ ఒవైసీ
పండితుల ఆశీర్వచనం తీసుకున్న అసదుద్దీన్ ఒవైసీ
మొబైల్ టార్చ్‌తో డాక్టర్ సిజేరియన్‌ .. తల్లీబిడ్డ మృతి
మొబైల్ టార్చ్‌తో డాక్టర్ సిజేరియన్‌ .. తల్లీబిడ్డ మృతి
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక.. ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక.. ఏమన్నారంటే
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..