నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్ అద‌ృశ్యం..!

ఉత్తర కొరియా ప్రెసిడెంట్‌ కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ప్రస్తుతం గజగజ వణికిపోతున్నాడు..భయంతో కిమ్‌ పత్తా లేకుండా పోయారట.. అవును.. నార్త్‌ కొరియా ప్రెసిడెంట్‌ కిమ్‌ జామ్‌ ఉన్‌ పరార్‌ అయ్యారు. ప్రాణభయంతో జడుసుకొని రాజధాని విడిచి వెళ్లిపోయారట..

నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్ అద‌ృశ్యం..!
Follow us

|

Updated on: Mar 13, 2020 | 7:50 AM

ఆయన ఐదడుగుల బుల్లెట్టు.. అతని పేరు చెబితే ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుడుతుంది.. ఆ పేరెత్తితే అగ్రరాజ్యాధినేతకు సైతం కంటిమీద కునుకు కరువవుతుంది.. అంతటి ధైర్యశాలిగా పేరుగడించిన ఉత్తర కొరియా ప్రెసిడెంట్‌ కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ప్రస్తుతం గజగజ వణికిపోతున్నాడు..భయంతో కిమ్‌ పత్తా లేకుండా పోయారు. ఇంతకీ కిమ్‌కి వెంటాడుతున్నదేవరు..? అతడి అదృశ్యం వెనుక అసలు కారణం ఏంటీ..?

అవును.. నార్త్‌ కొరియా ప్రెసిడెంట్‌ కిమ్‌ జామ్‌ ఉన్‌ పరార్‌ అయ్యారు. ప్రాణభయంతో జడుసుకొని రాజధాని విడిచి వెళ్లిపోయారు. ఆ మహమ్మారితో ఎందుకు అనుకున్నాడేమో తీర ప్రాంత నగరానికి పారిపోయాడు. ఎవరికీ కనిపించని విధంగా అత్యంత సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాడు. దాని కంట పడకుండా ఉండేందుకు కఠిన నిర్ణయం తీసుకున్నారు కిమ్‌ జాంగ్‌. ప్రభుత్వంలోని ఒకరిద్దరు ముఖ్యులకు మాత్రమే కిమ్‌ జాడ తెలుసని.. మరెవరికీ అతనెక్కడున్నాడన్నది అంతుబట్టడం లేదు. మిసైల్‌ టెస్టులతో అగ్రరాజ్యం అమెరికాను వణికించిన కిమ్‌ ఇలా అడ్రస్‌ లేకుండా పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

కిమ్‌జాంగ్‌ ఉన్‌కు కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండడంతో నార్త్‌ కొరియా అధినేత కిమ్‌ తీర ప్రాంతం వాన్సన్‌ నగరానికి వెళ్లారు. కరోనా తగ్గే వరకూ రాజధాని ప్యాంగ్యాంగ్‌ సిటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు కిమ్‌. నార్త్‌ కొరియాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడి 180 మంది సైనికులు మృతి చెందినట్లు నార్త్‌ కొరియా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ముందుజాగ్రత్త చర్యగా కిమ్‌ వాన్సన్‌ నగరానికి వెళ్లారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకూ అన్ని దేశాల్లో కలిపి లక్షా 18 వేల మంది కొవిడ్‌-19 వైరస్‌ బారినపడగా, 4 వేల 290 మంది మృత్యవాత పడ్డారు. ముఖ్యంగా ఇటలీలో మృత్యు ఘోష కొనసాగుతోంది. అమెరికా సైతం కరోనా కేసులతో అల్లాడిపోతుండటంతో యూరోప్‌ దేశాల నుంచి నెల రోజుల పాటు రాకపోకలను నిషేధించారు అధ్యక్షుడు ట్రంప్‌. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Latest Articles
ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?
ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?
పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే!
పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే!
T20 ప్రపంచకప్‌ కోసం సూర్య సన్నాహాలు.. మధ్యాహ్నం గ్రౌండ్‌కు వెళ్లి
T20 ప్రపంచకప్‌ కోసం సూర్య సన్నాహాలు.. మధ్యాహ్నం గ్రౌండ్‌కు వెళ్లి
అరే ఏంట్రా ఇది.. యంగ్ హీరో బాడీ మీద ఇలాంటి గేమ్సా.. ?
అరే ఏంట్రా ఇది.. యంగ్ హీరో బాడీ మీద ఇలాంటి గేమ్సా.. ?
'ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి..' CSIR హుకూం!
'ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి..' CSIR హుకూం!
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం
బ్యాటింగ్‌లో బాహుబలి.. బౌలింగ్‌లో భల్లాలదేవ.. ఈ ప్లేయర్ అరవీర.!
బ్యాటింగ్‌లో బాహుబలి.. బౌలింగ్‌లో భల్లాలదేవ.. ఈ ప్లేయర్ అరవీర.!
బాబీ డియోల్ డాన్స్ అచ్చు దించేసిన హీరోయిన్.. 32 ఏళ్ల క్రితమే...
బాబీ డియోల్ డాన్స్ అచ్చు దించేసిన హీరోయిన్.. 32 ఏళ్ల క్రితమే...
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా