‘కరోనా’ దెబ్బతో జోరందుకున్న ఆ సినిమా డౌన్‌లోడ్లు..
ఇప్పటికే కరోనా కారణంగా చాలా చోట్ల సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ప్రముఖ సినీ నటుల షూటింగ్‌లు, ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. అయితే ఇంత జరిగినా మాత్రం ఓ సినిమా కోసం మాత్రం జనాలు తెగ వెతికేస్తున్నారు. ఇక డౌన్‌లోడ్‌లు అయితే విపరీతంగా..
కరోనా వైరస్.. ఈ మాట వింటేనే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4వేల మందికి పైగా ప్రజలు దీని బారిన పడి మరణించారు. ఇక మరో వేల మంది ఈ వైరస్‌తో పోరాడుతున్నారు. అటు కరనా వ్యాప్తి వల్ల సినీ రంగం కూడా కుదేలయింది. ఇప్పటికే చాలా చోట్ల సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ప్రముఖ సినీ నటుల షూటింగ్‌లు, ప్రచార కార్యక్రమాలు కూడా రద్దయ్యాయి. అయితే ఇంత జరిగినా ఓ సినిమా కోసం మాత్రం జనాలు తెగ వెతికేస్తున్నారు. ఇక డౌన్‌లోడ్‌లు అయితే విపరీతంగా జోరందుకుంటున్నాయి. అసలు ఆ సినిమా ఏంటి? అనుకుంటున్నారా!
అదే ‘కంటేజియన్’. ఇది అమెరికన్ మెడికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం. 2011లో ఈ సినిమా విడుదలవ్వగా… స్టీవెన్ సోడర్ బర్గ్ దర్శకత్వం వహించారు. ఇందులో మాట్ డామన్, లారన్స్ ఫిష్ బర్న్, జూడ్ లా, గ్వినేత్ పాల్ట్రో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కథ ప్రస్తుతం మనం నిజ జీవితంలో ఎదుర్కొంటున్న కరోనాకు దగ్గరగా ఈ మూవీ కథ ఉండటమే విశేషం. దీంతో.. ఈ సినిమాను విపరీతమైన ఆసక్తి పెరిగింది నెటిజన్లకు. దీంతో.. కరోనా వైరస్ వచ్చిన దగ్గరనుంచీ ఇప్పటివరకూ ‘కంటేజియన్’ సినిమా డౌన్‌లోడ్లు క్రమంగా పెరిగాయి.
కరోనా విజృంభణకు ముందు ఈ చిత్రం అసుల టాప్ 100 జాబితాలో కూడా లేదు. కానీ ఇప్పుడు టాప్ 10 ప్లేస్‌కి చేరుకుంది. క్షణం క్షణం.. ఎంతో ఉత్కంఠగా సాగే ఈ సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.