18 మంది క్రైస్తవ సన్యాసినులకు కరోనా పాజిటివ్

కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ముఖ్యంగా అన్‌లాక్‌ 1.0 తర్వాత కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ప్రభుత్వం కఠిన చర్యలు..

18 మంది క్రైస్తవ సన్యాసినులకు కరోనా పాజిటివ్
Follow us

| Edited By:

Updated on: Jul 21, 2020 | 6:31 PM

కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ముఖ్యంగా అన్‌లాక్‌ 1.0 తర్వాత కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలువా సమీపంలోని చునంగంవేలిలో ఓ క్రైస్తవ సంస్థకు చెందిన ఓ కాన్వెంట్‌లోని నన్స్‌ కరోనా బారినపడ్డారు. మొత్తం పద్దెనిమిది మంది కాథలిక్‌ నన్స్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. వీరంతా సెయింట్ మేరీస్ ప్రావిన్స్‌కు చెందిన వారిగా గుర్తించారు. అయితే వీరంతా ఇటీవల కుజిప్పల్లిలోని ఓ 71 ఏళ్ల కాథలిక్ సన్యాసినితో వీరంతా కలిశారని వైద్యులు తెలిపారు. సదరు 71 ఏళ్ల కాథలిక్‌ సన్యాసిని కరోనా కారణంగా ఇటీవల మరణించినట్లు వైద్యులు తెలిపారు.