AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై WHO సంచలన ప్రకటన..అప్పటి వరకు తప్పదు..

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కోవిడ్-19 మహమ్మారి రోజురోజుకూ ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 67,35,174 కరోన కేసులు నమోదు అవ్వగా, 3,93,76 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కరోనా భూతం శాంతించటంలేదు. ఇటువంటి తరుణంలో

కరోనాపై WHO సంచలన ప్రకటన..అప్పటి వరకు తప్పదు..
Jyothi Gadda
|

Updated on: Jun 05, 2020 | 6:55 PM

Share

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కోవిడ్-19 మహమ్మారి రోజురోజుకూ ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 67,35,174 కరోన కేసులు నమోదు అవ్వగా, 3,93,76 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కరోనా భూతం శాంతించటంలేదు. ఇటువంటి తరుణంలోనే చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ..చాలా సడలింపులు ఇస్తుండటంపై డబ్ల్యూ హెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.

అనేక దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని సడలింపులు ఇస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మహమ్మారి ఇప్పట్లో పోయేది కాదని, సడలింపులు ఇచ్చినా, ప్రజలు తమ జాగ్రత్తలు తాము చూసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. యూరప్ దేశాల్లోనే కాకుండా ఇతర ఖండాల్లోనూ అనేక దేశాల్లో భౌతిక దూరం సహా అనేక అంశాల్లో సడలింపులు ఇస్తుండడంతో ఈ వైరస్ ప్రభావం పోయిందన్న భావన ప్రజల్లో కలుగుతోందని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ వైరస్ ఎక్కడికీ పోలేదని, ప్రపంచంలో ఎక్కడా ఈ వైరస్ లేదు అనేంతవరకు దీన్ని ఓ ముప్పుగానే పరిగణించాలని ఆమె పేర్కొన్నారు.

Follow Us