కరోనా కారణంగా దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పుణ్యమా అని ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా వ్యాప్తి పక్కన పెడితే.. దేశంలో నిరుద్యోగుల సంఖ్య మాత్రం ఈ మూడు నెలల్లో విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి తరుణంలో భారతదేశంలోని టాప్ ఆహార ఉత్పత్తుల కంపెనీలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశాయి. తమ దగ్గర బోలెడన్ని ఉద్యోగాలు ఉన్నాయని.. ఆహార కొరత ఏర్పడకుండా వర్కర్లను పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని కోరాయి. ఈ జాబితాలో పెప్సీ, పార్లే జీ, ఐటీసీ మోండెలేజ్, హిందుస్తాన్ యునీలీవర్, నెస్లే, బ్రిటానియా లాంటి టాప్ కంపెనీలు ఉన్నాయి.
ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో ఆహార కొరత ఏర్పడకుండా ఉండేందుకు ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటామని.. మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని పేర్కొంటూ కేంద్రానికి లేఖ రాశాయి. అంతేకాకుండా పని వేళలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచేలా అనుమతించాలని కోరాయి. పెరిగిన పని గంటలకు తగ్గటుగానే వేతనాలను కూడా పెంచుతామని తెలిపాయి. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Read More:
ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్ ప్రాంతాలు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లోనే కఠిన ఆంక్షలు!
వలస కూలీలకు ఉచిత ప్రయాణం.. జగన్ మార్క్ డెసిషన్
తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ఆ మూడు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిషేధం..