అక్కడి వారు మాస్క్‌లు వాడాల్సిన అవసరం లేదు: చైనా కొత్త మార్గదర్శకాలు

కరోనా మహమ్మారికి జన్మస్థానమైన చైనాలో ఈ వైరస్‌ ఉధృతి దాదాపుగా తగ్గుముఖం పట్టింది. దీంతో చైనాలో నిదానంగా ఆంక్షలు ఎత్తేస్తున్నారు

అక్కడి వారు మాస్క్‌లు వాడాల్సిన అవసరం లేదు: చైనా కొత్త మార్గదర్శకాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 17, 2020 | 4:38 PM

కరోనా మహమ్మారికి జన్మస్థానమైన చైనాలో ఈ వైరస్‌ ఉధృతి దాదాపుగా తగ్గుముఖం పట్టింది. దీంతో చైనాలో నిదానంగా ఆంక్షలు ఎత్తేస్తున్నారు. తాజాగా చైనా దేశ రాజధాని బీజింగ్‌లో బయటకు వెళ్లేవారు మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు బీజింగ్ సెంటర్ ఫర్ డిసీజ్‌ ప్రివెన్షన్ అక్కడి స్థానికులకు ఆదివారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

బయటకు వెళ్లే సమయంలో మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదు. కానీ భౌతిక దూరం కచ్చితంగా పాటించండి అని బీజింగ్ సెంటర్ ఫర్ డిసీజ్‌ ప్రివెన్షన్ తెలిపింది. అంతేకాదు వాతావరణం బాగున్నప్పుడు బయటికి వెళ్లి వ్యాయామం చేసుకోవచ్చునని కూడా వారు పేర్కొన్నారు. దీనివలన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వారు వెల్లడించారు. అయితే కరోనాకు కట్టడి వేసే క్రమంలో మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్ని దేశాలు హెచ్చరిస్తున్నాయి. కాగా కరోనా సంఖ్యలో చైనా, భారత్‌ని దాటిన విషయం తెలిసిందే.

Read This Story Also: ఓటీటీ రచ్చ.. స్టార్ హీరోకు షాక్‌..!