ఓటీటీ రచ్చ.. స్టార్ హీరోకు షాక్‌..!

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఓటీటీ రచ్చ హాట్‌టాపిక్‌గా మారింది. తమ సినిమాలను విడుదలకు సిద్ధంగా ఉంచుకోగా.. ఆ లోపు కరోనా మహమ్మారి రావడంతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి.

ఓటీటీ రచ్చ.. స్టార్ హీరోకు షాక్‌..!
Follow us

| Edited By:

Updated on: May 17, 2020 | 3:38 PM

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఓటీటీ రచ్చ హాట్‌టాపిక్‌గా మారింది. తమ సినిమాలను విడుదలకు సిద్ధంగా ఉంచుకోగా.. ఆ లోపు కరోనా మహమ్మారి రావడంతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా తెలియని పరిస్థితి. ఈ క్రమంలో దర్శకనిర్మాతలు ఓ అడుగు ముందుకేశారు. ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాంలలో తమ సినిమాలను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఆన్‌లైన్‌లో సినిమాలు విడుదల చేస్తే అస్సలు ఒప్పుకోమంటూ థియేటర్‌ యజమాన సంఘాలు అంటున్నారు. అలా కాదని విడుదల చేస్తే వారి తదుపరి సినిమాలను థియేటర్లలో విడుదల కానివ్వమంటూ హెచ్చరిస్తున్నారు. బాలీవుడ్‌లో ఈ బాధ పెద్దగా లేనప్పటికీ.. సౌతిండస్ట్రీలో మాత్రం ఆన్‌లైన్‌ రిలీజ్‌ను థియేటర్ సంఘాలు అస్సలు ఒప్పుకోవట్లేదు.

ఈ క్రమంలో ఆ మధ్యన సూర్యకు థియేటర్‌ సంఘాలు గట్టి హెచ్చరికలే జారీ చేశాయి. అయితే సూర్యకు నిర్మాతల మండలి నుంచి మద్దతు లభించింది. ఒక నిర్మాతకు తన సినిమాను ఎలాగైనా అమ్ముకునే హక్కు ఉందని తమిళనాడు నిర్మాతల మండలి తెలిపింది. దీంతో కోలీవుడ్‌లో ఆ వివాదం కాస్త తగ్గినట్లైంది. ఇక తాజాగా మాలీవుడ్‌లో ఓటీటీ రచ్చ ప్రారంభమైంది. అక్కడి స్టార్ నటుడు జయసూర్య నటించిన సుఫియమ్‌ సుజాతయమ్‌ సినిమా అమెజాన్‌లో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో జయసూర్య తదుపరి చిత్రాలతో పాటు సుఫియమ్‌ సుజాతయమ్‌ చిత్రాన్ని నిర్మించిన విజయ్‌ బాబు తదుపరి చిత్రాలను థియేటర్లలో విడుదల చేయనివ్వమని థియేటర్ యజమానులు చెబుతున్నాయి. అంతేకాదు వారికి మద్దతిచ్చే వారి సినిమాలను కూడా అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. కాగా కరోనా నేపథ్యంలో ఇంకా చాలా చిత్రాలు ఆన్‌లైన్‌లో విడుదలయ్యేందుకు సిద్దమవుతున్నాయి.

Read This Story Also: ఇన్‌స్టా అకౌంట్‌ డీయాక్టివేట్ చేసిన ఓవర్‌ నైట్ సెన్సేషన్.. ఎందుకంటే!

Latest Articles