సాధారణంగా ఇక్కడైనా ఎక్కడైనా హీరోయిన్లు, హీరోల మధ్య పోటీ ఉంటుంది. ఒక్కోసారి ఆ పోటీ యుద్ద వాతావరణం నెలకొంటుంది.
కానీ ఇక్కడ ఒక సారి వారి వారి నటనలతో ఒక సారి నిరూపించుకున్న ఇద్దరు రిటైర్ అయిన తారల మధ్య పోటీ నెలకొంది. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో తెలుసా ??
వారెవరో కాదు జ్యోతిక- ప్రియమణి.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు.. స్టార్ హీరోల సరసన మెరిసిన తారలు. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు గా రిటైర్ అయ్యారు.
అయితే వీరి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వీరిద్దరూ ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారానే చెప్పాలి. వరుస సినిమాలతో సీనియర్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.
అయితే జ్యోతికకు ప్రియమణి తలనొప్పి క్రియేట్ చేస్తుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . చాలా కాలం ఇంటికే పరిమితం అయ్యింది జ్యోతిక మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి.. పవర్ ఫుల్ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తోంది.
సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో పాటు.. వీరాట పర్వం, జవాన్ లాంటి సినిమాలు ప్రియమణికి ప్రత్యేక ఇమేజ్ ను తీసుకొచ్చింది.
సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో పాటు.. వీరాట పర్వం, జవాన్ లాంటి సినిమాలు ప్రియమణికి ప్రత్యేక ఇమేజ్ ను తీసుకొచ్చింది.
ఒక వేళా జ్యోతిక రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయకుండా ఉంటే.. ప్రియమణి పాత్రలు జ్యోతిక చేసి ఉండేది అంటున్నారు.