కరోనా అలర్ట్: వారితోనే అధికప్రమాదమంటున్న వైద్యులు

కరోనా విషయంలో రోజు రోజుకు అప్‌డేట్స్ చూస్తుంటే బుర్ర గిర్రున తిరిగి పోతుంది. కరోనా మహమ్మారి మనుషిలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుందని,..

కరోనా అలర్ట్: వారితోనే అధికప్రమాదమంటున్న వైద్యులు
Follow us

|

Updated on: Sep 03, 2020 | 6:10 PM

కరోనా విషయంలో రోజు రోజుకు అప్‌డేట్స్ చూస్తుంటే బుర్ర గిర్రున తిరిగి పోతుంది. కరోనా మహమ్మారి మనుషిలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుందని అనేక మంది శాస్త్రవేత్తలు, వైద్యులు ఇప్పటికే అనేక సార్లు వెల్లడించారు. కరోనా బారిన పడకుండా ఏ విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ఒకవేళ పాజిటివ్ గా నిర్ధారణ అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మనోధైర్యం తోనే వైరస్ బారినుంచి భయటపడగలమని చెబుతున్నారు. ఇకపోతే, ఇక్కడ మరో విషయం వెల్లడించారు అధ్యయకారులు. అసిమ్టమాటిక్ వారితోనే అధిక ప్రమాదం ఉందని అంటున్నారు.

అసిమ్టమాటిక్ వారిలో ఇప్పటి వరకు వైరల్‌ లోడ్‌ ఉండదని అనుకున్నారు. అయితే వారిలో కూడా లోడ్‌ ఎక్కువగా ఉంటుందని కొత్త అధ్యాయనాలు చెబుతున్నాయి. వాళ్ళే వైరస్ కారియర్లు అవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అసిమ్టమాటిక్ అనేది చాలా ప్రమాదమని అన్నారు. వారిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా చేరి ఇతరులకు వ్యాప్తి చెందుతోందని అన్నారు. వారిలో లక్షణాలు కనిపించకపోవడంతో నిర్లక్ష్యం కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. మాస్క్‌, సామాజిక దూరం, శానిటైజ్‌ ఉపయోగించకపోతే ఒక వ్యక్తి నుంచి ఆరుగురికి సోకే అవకాశముందన్నారు. అసిమ్టమాటిక్ ఉన్న వ్యక్తి మాట్లాడితే ఐదు అడుగుల దూరం వరకు వైరస్‌ వ్యాప్తి చెందుతుందని చెప్పారు. వారికి జలుబు, దగ్గు, తుమ్ములు ఉండవని డాక్టర్లు తెలిపారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో వారు కూడా వ్యాధి తీవ్రం అయ్యేవరకు తెలుసుకోలేక పోతున్నారని అన్నారు. దీంతో తాము క్యారియర్స్‌ అన్న సంగతి గుర్తించడం లేదని వైద్యులు వెల్లడించారు.