చేతల్లోకి దిగండంటూ.. సీఎంపై గౌతమ్ గంభీర్ ఫైర్

| Edited By:

Apr 07, 2020 | 3:56 PM

మాటలు ఆపి.. చేతల్లోకి దిగండంటూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై భారత మాజీ క్రికెటర్, లోక్‌సభ సభ్యుడు గౌతం గంభీర్ అసహనం వ్యక్తం చేశారు. వైరస్‌పై పోరుకు తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా..

చేతల్లోకి దిగండంటూ.. సీఎంపై గౌతమ్ గంభీర్ ఫైర్
Follow us on

మాటలు ఆపి.. చేతల్లోకి దిగండంటూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై భారత మాజీ క్రికెటర్, లోక్‌సభ సభ్యుడు గౌతం గంభీర్ అసహనం వ్యక్తం చేశారు. వైరస్‌పై పోరుకు తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా సీఎం కేజ్రీవాల్‌కు సూచించాడు. అంతకుముందు ఢిల్లీ ప్రభుత్వ నిధుల కొరత కారణంగానే వైద్య సిబ్బందికి తగిన వైద్య ఉత్పత్తులు అందించలేకపోయిందని పేర్కొంది. దీనిపై స్పందించిన గంభీర్.. కోటి రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపాడు. ఈగోలకు పోకుండా.. ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవాలని గంభీర్ పేర్కొన్నాడు.

తాజాగా మరోసారి ట్విట్టర్‌లో ఢిల్లీ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించాడు గౌతమ్. ఢిల్లీ ఢిప్యూటీ సీఎం నిధుల కొరత ఉందని అంతకు ముందు తెలిపారని.. అందువల్లే తాను నిధులను కేటాయించినట్లు గంభీర్ తెలిపాడు. ప్రస్తుతం వెయ్యి పిపిఈ కిట్లను సమకూర్చానని, వీటిని ఎక్కడ డెలివరీ చేయాలో చెప్పాలని ట్విట్టర్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. సంక్షోభ సమయంలో మాటలను మాని, చేతుల్లోకి దిగాలని సూచించాడు. అలాగే ఢిల్లీ ప్రభుత్వ స్పందనపై వేచి చూస్తున్నట్లు ట్వీట్ చేశాడు. మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4400లకి పైగా దాటగా.. ఇప్పటివరకూ 120 మందికి పైగా మరణించారు.

ఇవి కూడా చదవండి:

హైదరాబాద్‌ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తొలి కరోనా కేసు

ఇంకో వంద కరోనా కేసులు పెరగొచ్చు: సీఎం కేసీఆర్

బ్రేకింగ్: లాక్‌డౌన్‌ని కొనసాగించాలని ప్రధానిని కోరుతున్నా

సొంతూరికి వెళ్లడానికి శవం గెటప్.. ఐదుగురిపై కేసు

గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా రోగి’ అదృశ్యం.. అసలేం జరిగిందంటే!