India Corona cases: డేంజర్ బెల్స్.. భారత్‌లో అనూహ్యంగా పెరిగిన కరోనా కేసులు

|

Jan 04, 2022 | 11:01 AM

భారత్‌లో కోవిడ్ ఉధృతికి మరోసారి మొదలైంది. ఓ వైపు కరోనా.. మరో వైపు కోవిడ్ వేరియట్ ఒమిక్రాన్‌ కేసులు వణుకుపుట్టిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 37,379 కొత్త కరోనా కేసులు..

India Corona cases: డేంజర్ బెల్స్.. భారత్‌లో అనూహ్యంగా పెరిగిన కరోనా కేసులు
Corona
Follow us on

India Coronavirus Updates: భారత్‌లో కోవిడ్ ఉధృతికి మరోసారి మొదలైంది. ఓ వైపు కరోనా.. మరో వైపు కోవిడ్ వేరియట్ ఒమిక్రాన్‌ కేసులు వణుకుపుట్టిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 37,379 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 11,007 మంది కోలుకున్నారు. ఈ సమయంలో 124 మంది కోవిడ్‌తో మరణించారు. కరోనా డెల్టా వేరియంట్‌తో పాటు.. ఓమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 1,892కి చేరింది. మహారాష్ట్ర , ఢిల్లీలో అత్యధికంగా 568 , 382 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం ఓమిక్రాన్ 1,892 మంది రోగులలో 766 మంది కోలుకున్నారు.

23 రాష్ట్రాల్లో 1892 ఓమిక్రాన్ కేసులు..

ఓమిక్రాన్ కేసులు 1892 చేరాయి. ఇందులో 6 రాష్ట్రాల్లో వందకు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 568, మహారాష్ట్రలో ఢిల్లీలో 382, ​​కేరళలో 185, రాజస్థాన్‌లో 174, గుజరాత్‌లో 152, తమిళనాడులో 121 కేసులు నమోదయ్యాయి. చికిత్సలో ఉన్న కేసులు మొత్తం ఇన్ఫెక్షన్ కేసులలో 0.49 శాతం కాగా, కోవిడ్-19 నుండి కోలుకునే జాతీయ రేటు 98.13 శాతం ఉంది. గత 24 గంటల్లో కోవిడ్-19 చికిత్స పొందుతున్న రోగుల సంఖ్యలో 26,248 కేసులు పెరిగాయి.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన ప్రకారం రోజువారీ సంక్రమణ రేటు 3.24 శాతం.. వారపు రేటు 2.05 శాతం ఉంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 3,43,06,414 మంది ఇన్‌ఫెక్షన్ రహితంగా మారారు. కోవిడ్ -19 నుండి మరణాల రేటు 1.38 శాతం చేరింది.

రాష్ట్రాలలో ఓమిక్రాన్ గణాంకాలు

ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం దేశ వ్యాప్తంగా ఉన్న ఓమిక్రాన్ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,49,60,261 కు చేరుకుంది. అదే సమయంలో 15 రోజుల క్రితం వరకు 1 లక్షకు దగ్గరగా ఉన్న యాక్టివ్ కేసులు ఇప్పుడు 1,71,830కి పెరిగాయి. అదే సమయంలో దేశంలో కరోనా నుండి కోలుకుంటున్న రోగుల సంఖ్య 3,43,06,414 కు పెరిగింది.

ఇవి కూడా చదవండి: Drink and Drive Fine: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికాడు.. తన వెహికిల్‌ని తానే తగలబెట్టుకున్నాడు.. ఎందుకో తెలుసా..

CM KCR: లాక్‎డౌన్ విధించాల్సిన అవసరం లేదు.. కానీ జాగ్రత్తగా ఉండాలి..