‘కోవాక్స్’ వ్యాక్సిన్ గ్రూపులోకి భారత్‌ని ఆహ్వానించాలనుకుంటున్నాం

క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో కోవాక్స్ ప్రాజెక్టును చేప‌ట్టిన విషయం తెలిసిందే

'కోవాక్స్' వ్యాక్సిన్ గ్రూపులోకి భారత్‌ని ఆహ్వానించాలనుకుంటున్నాం
Follow us

| Edited By:

Updated on: Sep 08, 2020 | 6:29 PM

COVAX Global Vaccine: క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో కోవాక్స్ ప్రాజెక్టును చేప‌ట్టిన విషయం తెలిసిందే. ఇందులో 150 దేశాలు భాగం అవ్వనున్నాయి. వ్యాక్సిన్‌ను‌ అభివృద్ధి చేసి, అంద‌రికీ అందించే విధంగా ఆయా దేశాలు ప‌ర్య‌వేక్షించ‌నున్నాయి. ఇక ఈ ప్రాజెక్టుకు గావి వ్యాక్సిన్ గ్రూపు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న‌ది. కాగా ఈ గ్రూపులోకి భారత్‌ని ఆహ్వానించాలనుకుంటున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ అడ్వైజర్ బ్రూస్‌ అల్వార్డ్‌ వెల్లడించారు. ”ప్రపంచంలోని అన్ని దేశాల మాదిరిగా, కోవాక్స్ సదుపాయంలో భాగం అయ్యేందుకు భారత్‌కి అన్ని అర్హతలు ఉన్నాయి. ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి” అని ఆయన అన్నారు. 

కాగా ఈ ఒప్పందంలో భాగంగా వివిధ దశల్లో ఉన్న కరోనా టీకాను అందిపుచ్చుకుని అందులోని దేశాలకు పంపిణీ చేయనున్నాయి. దీని వలన అందరికీ ప్రయోజనం కలుగుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అయితే ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో తమది భిన్నమైన దారని.. టీకా అభివృద్ధి, పంపిణీ విషయంలో తామెవరితోనూ కలిసి నడవబోమని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Read More:

డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ హెచ్చరికపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్‌

వారం నుంచి నీరసంగా ఉన్నారు: జయప్రకాష్ రెడ్డి భార్య