డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ హెచ్చరికపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్‌

కరోనా మహమ్మారి అన్నది చివరిది కాదని.. భవిష్యత్‌లోనూ ఇలాంటివి ఎన్నో వస్తాయని, అందుకు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని

డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ హెచ్చరికపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్‌
Follow us

| Edited By:

Updated on: Sep 08, 2020 | 6:09 PM

Anand Mahindra tweet: కరోనా మహమ్మారి అన్నది చివరిది కాదని.. భవిష్యత్‌లోనూ ఇలాంటివి ఎన్నో వస్తాయని, అందుకు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. గతంలోనూ ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాగా టెడ్రోస్ హెచ్చరికలపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు.

నిరాశకు గురిచేయనివ్వకుండా, ముందు మమ్మల్ని ఈ మహమ్మారి సంక్షోభం నుంచి బయటపడనివ్వరా..! అంటూ మహేంద్ర ట్వీట్ చేశారు. ఇక ఆయన ట్వీట్‌కి నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. జనాన్ని భయపెట్టడం కంటే పరిస్కారాలను చూపించాలని ఓ నెజిటన్ డబ్య్లూహెచ్‌ఓకు సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు సానుకూలంగా చెప్పింది..? అంటూ కామెంట్ పెట్టారు. కరోనా విషయంలో ప్రసంగాలు తప్ప టెడ్రోస్ చేసిందేమీ లేదని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read More:

వారం నుంచి నీరసంగా ఉన్నారు: జయప్రకాష్ రెడ్డి భార్య

కరోనా మరణాలకు చెక్‌ పెడుతోన్న ‘విటమిన్ డి’