Coronavirus India: దేశవ్యాప్తంగా కరోనాతో నిన్న 84 మంది మృతి.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
India Coronavirus updates: దేశంలో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గత 24గంటల్లో ఆదివారం..
India Coronavirus updates: దేశంలో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గత 24గంటల్లో ఆదివారం 11,831 కరోనా కేసులు నమోదుకాగా.. ఈ వైరస్ కారణంగా 84 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,38,194 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,55,080కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
కాగా.. నిన్న కరోనా నుంచి 11,904 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,05,34,505 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,48,609 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.20 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.43 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 5,32,236 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఫిబ్రవరి 8వ తేదీ వరకు 20,19,00,614 పరీక్షలు చేశారు.
ఇదిలాఉంటే.. భారత్‌లో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా సాగుతోంది. సోమవారం వరకు దేశవ్యాప్తంగా 58,12,362 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read: