Holi 2022 – Covid 19: హోళీ పండుగ కోవిడ్ 19 ఫోర్త్ వేవ్‌ను ఆహ్వానిస్తుందా? నిపుణులు ఏం హెచ్చరిస్తున్నారు?

|

Mar 15, 2022 | 2:31 PM

Holi - Covid 19: దేశంలో గత కొన్ని వారాలుగా నమోదవుతున్న కోవిడ్-19 కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఆదివారం, దేశంలో దాదాపు..

Holi 2022 - Covid 19: హోళీ పండుగ కోవిడ్ 19 ఫోర్త్ వేవ్‌ను ఆహ్వానిస్తుందా? నిపుణులు ఏం హెచ్చరిస్తున్నారు?
Holi
Follow us on

Holi – Covid 19: దేశంలో గత కొన్ని వారాలుగా నమోదవుతున్న కోవిడ్-19 కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఆదివారం, దేశంలో దాదాపు 3,000 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 667 రోజుల తర్వాత అత్యల్ప సంఖ్యంలో నమోదైన కేసులు కావడం విశేషం. ఇక సోమవారం కూడా అంతే స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ పరిస్థితిని గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాత్రి కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు, సభల, సమావేశాలపై ఆంక్షలు మొదలైన్న అన్ని రకాల కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయాలని, అంతర్రాష్ట్ర కదలికలను నియంత్రించవద్దని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు కోవిడ్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశాయి. ఇదిలాఉంటే.. మార్చి 18న హోలీ (రంగుల పండుగ) జరుపుకోవడంతో, పెద్దఎత్తున సమావేశాలు ఏర్పాటు చేయడం వంటి వాటి వల్ల కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పలువురుశాస్త్రవేత్తలు అంచనాల ఆధారంగా.. జూన్-జూలైలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే వైరాలజిస్టులు మాత్రం ఈ అంచనాన్ని తోసిపుచ్చారు. ఇది ఊహమాత్రమే అని కొట్టిపారేశారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కూడా SARS-CoV 2 ఇంకా అంత్య వ్యాప్తికి చేరుకుందని ప్రకటించడానికి సిద్ధంగా లేదు. దక్షిణాసియాలో చైనా, దక్షిణ కొరియాలలో ఒమిక్రాన్ కేసులు భారీ పెరుగుతుండటం ప్రపంచ దేశాలను మరోసారి కలవరానికి గురి చేస్తుంది. ప్రత్యేకించి మన దేశంలో హోలీ పండుగను ఆంక్షలు లేకుండా జరుపుకోవడం సరియైనదేనా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సరం కూడా హోలీ పండుగ సందర్భంగా కరోనా కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో.. అప్పుడు కేంద్ర విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 22 కింద పరిమితులు విధించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.

హోలీ వేడుకలు మరొక ప్రభంజనానికి ప్రారంభ సంకేతం కాగలదా?
ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్, పల్మోనాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రవి శేఖర్ ఝా ప్రకారం. శాస్త్రీయ ఆధారాల ఆధారంగా హోలీ తర్వాత కోవిడ్ ప్రభావం ఏమీ ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం కోవిడ్ పెరుగుదల, మూడు వేవ్‌ల మధ్య వ్యవధి ఆధారంగా, హోలీ తర్వాత వెంటనే కేసులు ఆ స్థాయికి పెరిగే అవకాశం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి.. ఒక వేవ్‌కకు, మరొక వేవ్‌కు మధ్య దాదాపు 4 నెలల సమయం ఉంటూ వచ్చింది. గత సంవత్సరం, ఏప్రిల్ 2021 నుండి ఈ కేసులు విపరీతంగా పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్.. హోలీ తర్వాత ముగిసింది. సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్‌కి 4 నెలలు సమయం వచ్చింది.’’ అని విశ్లేషించారాయన. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ ట్రెండ్ చూస్తుంటే హోలీ వేడుకలు మరో వేవ్‌గా మారే అవకాశాలు చాలా తక్కువని ఆయన అన్నారు.

హోలీ సమయంలో సామూహిక సమావేశాలను అనుమతించాలా?
హోలీ తర్వాత మరొక ఉప్పెనకు అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, ప్రజలు భారీ సమావేశాలలో భాగం కావడంపై పునరాలోచించుకోవాలని డాక్టర్ ఝా సూచించారు. ఎందుకంటే వేరియంట్‌లు ఇంకా మిగిలి ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డా. ‘‘మరో వేవ్ వస్తుందా? లేదా? అనేది కాకుండా.. మనం ఇంకా పూర్తిగా ఈ సమస్య నుంచి బయటపడలేదు. ఆందోళన ఏంటంటే.. హోలీని రంగుల నీటితో ఎక్కువగా ఆడతారు. ఇది సైనస్ అలర్జీలతో బాధపడేవారికి ప్రాణాంతకం అని అనేక పరిశీలన లలో రుజువైంది. ఇలాంటి సమస్యతో బాధపడే వ్యక్తులు.. మరింత అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. హోలీ వేడుకల నేపథ్యంలో నీటితో తడవడం వలన తుమ్ములు, దగ్గు, ముక్కు కారడం వంటి సమస్యలతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది.’’ అని పేర్కొన్నారు.

సూచనలేంటి?..
కోవిడ్ -19 ప్రమాదం పూర్తిగా సమసిపోని కారణంగా.. సామూహిక సమావేశాలకు దూరంగా ఉండటమే మంచిదని డాక్టర్ ఝా సూచిస్తున్నారు. అలాగే.. హోలీని జరుపుకోవాలని నిర్ణయించుకుంటే.. పొడి, సేంద్రీయ రంగులతో జరుపుకోవాలని సూచించారు. సామూహిక సమావేశాలు జరగకుండా చూసుకోవడంలో ప్రభుత్వం తన వంతు పాత్రను పోషించాలి. ఈ దశలో అన్ని ఆంక్షలను ఎత్తివేయడం మూర్ఖత్వం. ముఖ్యంగా పండుగల సమయంలో అన్-లాక్ చేయడం అనేది సరైన చర్య కాదు.’’ అని అభిప్రాయపం వ్యక్తం చేశారాయన.

డాక్టర్ హనీ సావ్లా(ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్) కోవిడ్ 19 వ్యాప్తిపై భిన్నమైన దృక్పథాన్ని వ్యక్తం చేశారు. దేశ జనాభాలో చాలా మంది రెండు డోసులు, సింగిల్ డోస్ వ్యాక్సీన్ తీసుకున్నారు. దీని వలల దేశంలో కోవిడ్ వేరియంట్ల ముప్పు ఇదివరకటి మాదిరిగా ఉండదని పేర్కొన్నారు. ‘‘దేశ జనాభాలో దాదాపు 90 శాతం మంది మొదటి డోస్‌ను వేయించుకున్నారు. అదే సమయంలో దాదాపు 80 శాతం మంది రెండు డోసుల టీకాలు వేయించుకున్నారు. చాలా మందికి బూస్టర్ డోస్ కూడా వేశారు. ఇప్పుడు కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో ఆంక్షల గురించి దృష్టి పెట్టకూడదు. ప్రజల జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడం గురించి మాత్రమే ఆలోచించాలి.’’ అని ఆమె పేర్కొన్నారు.

ప్రజల్లో మానసిక స్థైర్యం నింపడానికి.. పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం అని డాక్టర్ సావ్లా పేర్కొన్నారు. ఇది జరగాలంటే కరోనాతో సహజీవనానికి అలవాటు పడాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా కోవిడ్‌కు ముందు ఉన్నట్లే తిరిగి జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు.

ఇదిలాఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయొద్దని హెచ్చరిస్తున్నారు. SARS-CoV-2 వైరస్ వేరియంట్‌లు ఇప్పటికీ కొనసాగుతున్నందున ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు అన్ని పరిమితులను ఎత్తివేయకూడదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు COVID-19 క్షీణత ప్రోత్సాహకరంగా ఉందని ఆరోగ్య నిపుణులు అంగీకరిస్తున్నారు. అయితే వైరల్ పునరుజ్జీవనాన్ని అంచనా వేయకుండా ముందస్తుగా విజయాన్ని ప్రకటించవద్దని చాలా మంది హెచ్చరికలు చేస్తున్నారు. ఇక దేశాల నుంచి సరైన డేటా రావడం లేదంటూ పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘‘కోవిడ్ కేసులు భారీగా తగ్గుతున్నప్పటికీ.. ఇంకా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తే.. వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత వేవ్‌ను మరింత పెరిగే ఛాన్స్‌ ఉండటంతో పాటు.. కొత్త వేరియంట్ వ్యాప్తిని పెంచుతుంది.’’ అని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జాన్ బ్రౌన్‌స్టెయిన్ చెప్పుకొచ్చారు.

ముగింపు: హోలీ వల్ల మరో కోవిడ్ ఉప్పెన ఉండకపోవచ్చునని నిపుణులు వాదిస్తున్నప్పటికీ, ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం ఉత్తమమని కూడా సూచిస్తున్నారు. ‘‘పండుగను సెలబ్రేట్ చేసుకోండి. అయితే, నీటితో ఆడుకోకుండా ఉండండి, భారీ సమావేశాలకు దూరంగా ఉండండి’’ అని డాక్టర్ ఝా సూచించారు.

Also read:

Hijab Row Case: హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పు.. నేతల రియాక్షన్స్ ఇవీ..

CAG Report: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణపై కాగ్‌ విమర్శలు.. తెలంగాణ బడ్జెట్‌పై కాగ్‌ నివేదిక..

Hair Splitting: మీ జుట్టు మొత్తం చిట్లిపోతుందా..? అయితే ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి..