Corona Food: క‌రోనాతో ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారా డార్క్ చాక్లెట్ తినండి.. ఇమ్యూనిటీ పెంచుకోవ‌డానికి ఇవి తీసుకోండి..

|

May 08, 2021 | 6:07 AM

Food For Corona Patients: క‌రోనా మ‌హ‌మ్మారి మ‌నుషుల ఆరోగ్యాల‌తో ఒక ఆట ఆడుకుంటోంది. వ్యాధి బారిన ప‌డిన స‌మ‌యంలో కొంద‌రు ఆందోళ‌న‌తోనే ఎక్కువ‌గా అనారోగ్యానికి గుర‌వుతున్నారు. ఇక మ‌రికొంద‌రు..

Corona Food: క‌రోనాతో ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారా డార్క్ చాక్లెట్ తినండి.. ఇమ్యూనిటీ పెంచుకోవ‌డానికి ఇవి తీసుకోండి..
Food For Corona
Follow us on

Food For Corona Patients: క‌రోనా మ‌హ‌మ్మారి మ‌నుషుల ఆరోగ్యాల‌తో ఒక ఆట ఆడుకుంటోంది. వ్యాధి బారిన ప‌డిన స‌మ‌యంలో కొంద‌రు ఆందోళ‌న‌తోనే ఎక్కువ‌గా అనారోగ్యానికి గుర‌వుతున్నారు. ఇక మ‌రికొంద‌రు పూర్తిగా నీర‌సంగా మారుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలోనే స‌రైన పోష‌కాహారం తీసుకోవాల‌ని సూచిస్తున్నారు నిపుణులు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా భార‌త ప్ర‌భుత్వం క‌రోనా రోగులు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల‌కు సంబంధించి ఒక జాబితాను విడుద‌ల చేసింది. ఇందులో భాగంగానే MyGovIndia ఓ ట్వీట్ చేసింది. మ‌రి వీటిలో ఉన్న ఆహార ప‌దార్థాలేంటో ఓసారి చూడండి..

* క‌రోనా బారిన ప‌డిన వారు శ‌రీరానికి విట‌మిన్లు, ఖ‌నిజాలు అంద‌డానికి ఐదు ర‌కాలు పండ్లు, కూర‌గాయ‌లు తీసుకోవాలి.

* క‌రోనా కార‌ణంగా క‌లిగే ఆందోళ‌న‌ను అదుపులో పెట్టుకోవ‌డానికి 70 శాతం కొకొవా ఉన్న డార్క్ చాక్లెట్లు త‌క్కువ మోతాదులో తీసుకోవాలి.

* రోజులో ఒక‌సారి ప‌సుపు క‌లిపిన పాలు తాగాలి. ఇది రోగ నిరోధ శ‌క్తిని పెంచుతుంది.

* చాలా మంది క‌రోనా రోగులు వాస‌న గుణాన్ని కోల్పోతున్నారు. దీంతో ఆహారం తీసుకోవ‌డానికి ఆస‌క్తి చూపించ‌ట్లేదు. కాబ‌ట్టి త‌క్కువ మోతాదులో ఎక్కువ‌సార్లు తినే ప్ర‌య‌త్నం చేయాలి.

* రాగి, ఓట్స్‌లాంటి తృణ ధాన్యాల‌ను తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

* ఇక ప్రోటీన్ ఎక్కువ‌గా ల‌భించే చికెన్‌, ఫిష్‌, గుడ్లు, ప‌నీర్‌, సోయా, కాయ‌గింజ‌లు, బాదాం, వాల్‌న‌ట్స్‌, ఆలివ్ ఆయిల్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచిస్తోంది.

భార‌త ప్ర‌భుత్వం చేసిన ట్వీట్‌..

Also Read: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..

వెల్లుల్లితో నిజంగానే బీపీని కంట్రోల్ చేయవచ్చా ? దీంతో కలిగే ప్రయోజనాలెంటో తెలుసుకుందామా..

Indian Railways: కరోనా ఎఫెక్ట్‌.. దూరంతో, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ సహా 28 రైళ్లు రద్దు.. ఎప్పటివరకంటే..?