పీఎం సహాయ నిధికి విరాళం ప్రకటిస్తూ.. ప్రజలకు గడ్కరీ సందేశం..

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్రరూపం దాల్పుతోంది. రోజురోజుకు దీని తీవ్రత మరింత ఎక్కువగా అవుతోంది. ఇప్పటికే ఇరవై రెండు వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదు లక్షల మందికిపైగా దీని బారినపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా మూడు వారాలపాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు వివిధ వర్గాల నుంచి సంఘీభావం తెల్పుతు […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:36 pm, Fri, 27 March 20
పీఎం సహాయ నిధికి విరాళం ప్రకటిస్తూ.. ప్రజలకు గడ్కరీ సందేశం..

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్రరూపం దాల్పుతోంది. రోజురోజుకు దీని తీవ్రత మరింత ఎక్కువగా అవుతోంది. ఇప్పటికే ఇరవై రెండు వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదు లక్షల మందికిపైగా దీని బారినపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా మూడు వారాలపాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు వివిధ వర్గాల నుంచి సంఘీభావం తెల్పుతు తమవంతు సాయంగా ప్రభుత్వాలకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. దీనిలో భాగంగా కేంద్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలు సీఎం రిలీఫ్ ఫండ్, పీఎం రిలీఫ్ ఫండ్స్‌కు జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. తన నెల జీతాన్ని పీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కరోనా మహమ్మారిని తరమిందేకు.. ప్రభుత్వానికి మద్దతుగా అంతా ముందుకు రావాలంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాగా.. ఇప్పటికే పలువురు పార్టీల నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. వారివారి నెల జీతాలను పీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య.. ఏడువందలకు చేరుకుంటుంది. 16మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.