వెంటిలేటర్ మీద మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్ మీద చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న‌ బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ కోసం చేసిన సర్జరీ విజయవంతం అయిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. కాగా ఈ రోజు మ‌ధ్యాహ్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా..

వెంటిలేటర్ మీద మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2020 | 10:21 PM

మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్ మీద చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న‌ బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ కోసం చేసిన సర్జరీ విజయవంతం అయిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. కాగా ఈ రోజు మ‌ధ్యాహ్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా బారిన ప‌డ్డారు. ఆయన నార్మల్ చెకప్ కోసం హాస్పిట‌ల్‌కు వెళ్లారు. అయితే అక్కడ డాక్ట‌ర్లు క‌రోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. ఈ నేప‌థ్యంలో గత వారం రోజుల నుంచి తనతో కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లందరూ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాలని ప్ర‌ణ‌బ్ సూచించారు. అలాగే వారందరూ కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరారు. ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు దేశానికి 13వ భార‌త‌ రాష్ట్రపతిగా సేవ‌లందించారు. ప్ర‌ణ‌బ్‌కు కోవిడ్ సోకింద‌ని తెలిసి.. అనేక మంది పార్టీ సహచరులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు.

Read More: 

ఆగ‌ష్టు 15 వేడుక‌లపై తెలంగాణ హైకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాలు

ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్‌డేః ఫ్యాన్స్‌కు ‘వ‌కీల్ సాబ్ నుంచి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్’

ఆ రైల్వే నోటిఫికేష‌న్ ఫేక్.. గరంగ‌రం అయిన రైల్వే శాఖ‌