AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైద‌రాబాద్‌కు మ‌రో టెన్ష‌న్‌..ఫుడ్ డెలివ‌రీ బాయ్‌కి క‌రోనా !

క‌రోనా నేప‌థ్యంలో తెలంగాణకు మ‌రో కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. న‌గ‌రంలో ఓ ఫుడ్‌డెలివ‌రీ బాయ్‌కి క‌రోనా సోకిన‌ట్లుగా తెలిసింది.

హైద‌రాబాద్‌కు మ‌రో టెన్ష‌న్‌..ఫుడ్ డెలివ‌రీ బాయ్‌కి క‌రోనా !
Jyothi Gadda
|

Updated on: Apr 19, 2020 | 12:26 PM

Share
క‌రోనా నేప‌థ్యంలో తెలంగాణకు మ‌రో కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. అస‌లే మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల ప్ర‌కంప‌న‌లు రాష్ట్ర‌వ్యాప్తంగా నివురుగ‌ప్పిన నిప్పులా మారిన వైర‌స్ సెగ‌లు రేపుతోంది. కోవిడ్ కోర‌ల్లో చిక్కుకుని రాష్ట్రం అల్లాడిపోతోంది. ఈ త‌రుణంలో మ‌రో షాకింగ్ న్యూస్ హైద‌రాబాద్ వాసుల‌ను హ‌డ‌లెత్తిస్తోంది. న‌గ‌రంలో ఓ ఫుడ్‌డెలివ‌రీ బాయ్‌కి క‌రోనా సోకిన‌ట్లుగా తెలిసింది.
న‌గ‌ర‌వాసుల‌ను ఇప్పుడు కోవిడ్ భూతం వెంటాడుతోంది. ఏ రూపంలో మ‌హ‌మ్మారి పంజావిసురుతుంద‌ని ప్ర‌జ‌లు హ‌డ‌లెత్తిపోతుండ‌గా, న‌గ‌రంలో ఆన్‌లైన్ ఆర్డ‌ర్ల మీద ఫుడ్ డెలీవ‌రి చేసే యువ‌కుడికి క‌రోనా వ‌చ్చిన వైనం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఫుడ్ డెలివరీ యాప్ సంస్థలో పని చేస్తున్న హైద‌రాబాద్‌ నాంపల్లికి చెందిన కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో.. గడిచిన రెండు వారాలుగా అతడు ఏయే రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డర్లు తీసుకున్నాడు. ఎవరెవ‌రి ఇళ్ల‌కు డెలివరీ ఇచ్చాడ‌న్న‌దానిపై అధికారులు ఆరా చేప‌ట్టారు. బాధితుడి ట్రావెల్ హిస్ట‌రీని కూడా తెలుసుకుంటున్న అధికారులు..ఇప్పటికే అతడ్ని.. అతడి కుటుంబ స‌భ్యుల‌ను క్వారంటైన్ సెంట‌ర్‌కు తరలించారు. మ‌హా న‌గ‌రంలో పుడ్ డెలివరీ బాయ్ కు పాజిటివ్ అని తేలటంతో హైదరాబాదీయులకు కొత్త దడ మొదలైంది.

Follow Us