ప్రభాస్‌ నిజంగానే బాహుబలి అనిపించుకున్నాడు.. టీడీపీ సీనియర్ నేత ప్రశంసలు

| Edited By:

Apr 02, 2020 | 10:51 AM

టాలీవుడ్ హీరో ప్రభాస్ భారీ విరాళం ప్రకటించారు. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి స్పందించి, ప్రభాస్‌ను అభినందించారు. బాహుబలి చరిత్ర రికార్డుల్లోనే కాదు.. కరోనా విరాళాల్లోనూ తెలుగు సినీ రంగంలో ప్రభాస్ ముందుండటం..

ప్రభాస్‌ నిజంగానే బాహుబలి అనిపించుకున్నాడు.. టీడీపీ సీనియర్ నేత ప్రశంసలు
Follow us on

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఒక్కసారిగా ఆకాశానికెత్తారు. కరోనా వైరస్ కారణంగా.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇది ఏప్రిల్ 14వ తేదీ వరకూ కొనసాగనుంది. ఈ లాక్‌డౌన్ దెబ్బకు ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆర్థికంగానూ కష్టాలూ తప్పేలా లేవు. ఇలా విపత్కర పరిస్థితుల్లో రాజకీయ, వ్యాపార ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు. వారికి తోచిన సహాయం అందిస్తున్నారు.

ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో ప్రభాస్ భారీ విరాళం ప్రకటించారు. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి స్పందించి, ప్రభాస్‌ను అభినందించారు. బాహుబలి చరిత్ర రికార్డుల్లోనే కాదు.. కరోనా విరాళాల్లోనూ తెలుగు సినీ రంగంలో ప్రభాస్ ముందుండటం అభినందనీయమని సోమిరెడ్డి కొనియాడారు. చిన్న వయస్సులోనే పెద్ద మన్సు చాటుకుంటూ ప్రధానిమంత్రి సహాయ నిధికి రూ.3 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలు కోటి రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప విషయమని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు. కాగా తెలుగులో అనేకమంది స్టార్ హీరోలు విరాళాలు ఇచ్చినా.. వారందరి కంటే ఎక్కువగా ప్రభాస్ నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

 

ఇవి కూడా చదవండి: 

దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న 10 హాట్‌స్పాట్ కేంద్రాలివే

లాక్‌డౌన్‌పై తెలంగాణ పోలీసుల సర్వే.. చదువులేనోళ్లే నయం

కరోనా బాధితులకు ‘ఫోన్ పే’ ఇన్సూరెన్స్..

అనంతపురంలో నకిలీ మద్యం కలకలం.. ప్రాణాలతో చెలగాటం

ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాలతో పాటు ఇన్సెంటీవ్స్‌ కూడా

మరో నటుడ్ని బలితీసుకున్న కరోనా.. శోక సంద్రంలో సినీ పరిశ్రమ

కరోనా ఎఫెక్ట్: స్థానికున్ని కొట్టి చంపిన యువకులు

కరోనా దెబ్బ.. మోదీ సర్కార్ భారీ అప్పు