Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DRDO Drug 2-DG: కోవిడ్ బాధితుల‌కు గుడ్ న్యూస్‌.. బ‌హిరంగ మార్కెట్లోకి 2డీజీ డ్రగ్‌.. ధ‌ర ఎంతో తెలుసా.?

DRDO Drug 2-DG: క‌రోనా మ‌హ‌మ్మారి త‌రిమికొట్టే క్ర‌మంలో భార‌త ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో 2డీజీ డ్ర‌గ్‌ను రూపొందించిన విష‌యం తెలిసిందే. డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ భాగ‌స్వామ్యంతో ఈ ఔష‌ధాన్ని ఆవిష్క‌రించారు. పొడి రూపంలో...

DRDO Drug 2-DG: కోవిడ్ బాధితుల‌కు గుడ్ న్యూస్‌.. బ‌హిరంగ మార్కెట్లోకి 2డీజీ డ్రగ్‌.. ధ‌ర ఎంతో తెలుసా.?
Drdo 2g Drug
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 28, 2021 | 1:06 PM

DRDO Drug 2-DG: క‌రోనా మ‌హ‌మ్మారి త‌రిమికొట్టే క్ర‌మంలో భార‌త ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో 2డీజీ డ్ర‌గ్‌ను రూపొందించిన విష‌యం తెలిసిందే. డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ భాగ‌స్వామ్యంతో ఈ ఔష‌ధాన్ని ఆవిష్క‌రించారు. పొడి రూపంలో ఉండే ఈ ఔషధాన్ని మొద‌ట్లో క‌రోనా రోగుల‌కు ఎమ‌ర్జెన్సీ వాడకం కోసం రూపొందించారు. ఈ మందుతో కోవిడ్ రోగులు కేవ‌లం అత్యంత వేగంగా రిక‌వ‌రీ అవుతార‌ని డాక్ట‌ర్ రెడ్డీస్‌ ప్ర‌క‌టించింది. మే1వ తేదీన అత్య‌వస‌ర వినియోగం కింద ఈ డ్ర‌గ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విష‌యం విధిత‌మే. ఇదిలా ఉంటే ఇప్ప‌టి వర‌కు అత్య‌వ‌స‌ర ప‌రిస్థిల్లో మాత్ర‌మే ఉప‌యోగించే ఈ డ్ర‌గ్‌ను తాజాగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. డాక్ట‌ర్ రెడ్డీస్ ఈ ఔష‌ధాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈరోజు (సోమ‌వారం) నుంచి నేరుగా ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆసుప‌త్ర‌ల‌కు 2డీజీ ఔష‌ధాన్ని అందించ‌నున్న‌ట్లు డాక్ట‌ర్ రెడ్డీస్ తెలిపింది. ఒక్కో ప్యాకెట్ ధ‌ర‌ను రూ. 990గా నిర్ణ‌యించారు. ఇక ఈ డ్ర‌గ్ ప‌నితీరు ఎలా ఉంటుందంటే.. కరోనా పేషెంట్ల శరీరంలో కరోనా వల్ల దెబ్బతిన్న కణాలను గుర్తిస్తుంది. అక్కడ వైరస్‌కి ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది. అందువల్ల వైరస్ నీరసించిపోతుంది. దాని వల్ల వైరస్ ఇక వృద్ధి చెందలేదు. అంతే… అక్కడితో కరోనా ఆగిపోతుంది. క్రమంగా వైరస్ నీరసించి చనిపోతుంటే.. కరోనా నయం అయిపోతుంది. ఫలితంగా కణాలు తిరిగి రిపేర్ అయ్యి… బాగవుతాయి. పేషెంట్లు త్వరగా కోలుకుంటారు.

Also Read: Global Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు.. బ్రిటన్, అమెరికాలను దాటేసిన భారత్

India Corona Updates: గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా ఎన్ని క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.. ఎంత మంది మ‌ర‌ణించారంటే.

Corona Lambda: క‌ల‌వ‌ర‌పెడుతోన్న క‌రోనా కొత్త‌ వేరియంట్ ‘లాంబ్డా’.. హెచ్చ‌రిస్తోన్న ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌..