రాజధానిలో కరోనా ఉగ్రరూపం..70 వేల మార్క్ దాటిన పాజిటివ్ కేసులు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉగ్ర రూపం ప్రదర్శిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 3,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల..

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 3,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70వేల మార్క్‌ను దాటింది. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70,390కి చేరింది. ఢిల్లీలో కరోనా మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో ఇవాళ ఒక్కరోజే 64 మంది మృత్యువాతపడ్డారు.
ఢిల్లీలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా మెరుగ్గానే ఉండటం కాస్త ఊరట కలిగించే విషయంగా భావిస్తున్నారు. ఢిల్లీలో ఇవాళ ఒక్కరోజే 2124 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 70390కి చేరగా.. ఇందులో 41437 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 26,588. ఉండగా, 2365 మంది కరోనా వల్ల మరణించారు.




