Covid -19: కొవిడ్ అలర్ట్..! పిల్లల్లో మానసిక సమస్యల పెరుగుదల.. వ్యాధి తీవ్రత అధికం..?

Covid -19: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురు పిల్లల్లో ఒకరికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. కొవిడ్‌ దానిని మరింత తీవ్రతరం చేస్తోందని యునిసెఫ్ ప్రకటించింది.

Covid -19: కొవిడ్ అలర్ట్..! పిల్లల్లో మానసిక సమస్యల పెరుగుదల.. వ్యాధి తీవ్రత అధికం..?
Covid In Children

Edited By: Ravi Kiran

Updated on: Oct 06, 2021 | 6:32 AM

Covid -19: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురు పిల్లల్లో ఒకరికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. కొవిడ్‌ దానిని మరింత తీవ్రతరం చేస్తోందని యునిసెఫ్ ప్రకటించింది. ఇండియా ప్రతినిధి డాక్టర్ యాస్మిన్ అలీ హక్ మాట్లాడుతూ.. సమస్యలు ఉన్నప్పటికీ పిల్లలు వాటి గురించి మాట్లాడకపోవడం తాము గమనించామని అన్నారు. తల్లిదండ్రులు, సంరక్షకులు వారి ప్రవర్తనను గమనించాలని, వారి ఆలోచనలను షేర్‌ చేసుకునే విధంగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అప్పేడే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని, అంతేకాకుండా చికిత్స చేయడం సులభతరం అవుతుందని వెల్లడించారు.

కొవిడ్ మహమ్మారి పిల్లలపైనే కాకుండా యువకులు, పెద్దవారి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపుతుందన్నారు. కానీ లక్షణాలు ఆలస్యంగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు. చాలా మంది పిల్లలు ఆందోళనతో నిండి ఉన్నారని ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమని తెలిపారు. వాస్తవానికి ఈ సమయం పిల్లలు, యుతకు సవాలుతో కూడుకున్నదని, థర్డ్‌ వేవ్‌ ముప్పు ఎక్కువగా ఉందని వివరించారు.

మానసిక సమస్యలు
యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్ మాట్లాడుతూ.. “దేశవ్యాప్త లాక్డౌన్ ఆంక్షల కారణంగా పిల్లలు.. కుటుంబం, స్నేహితులు, తరగతి గదులు, ఆట స్థలం నుంచి చాలాకాలం దూరంగా గడిపారు. అయితే కొవిడ్‌కి ముందే చాలా మంది పిల్లలు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారి అవసరాలను తీర్చడానికి ప్రభుత్వాలు చేస్తున్న పెట్టుబడి కూడా చాలా తక్కువ. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ మానసిక సమస్యలు అధికమయ్యాయి” అన్నారు.

High Court Judges: దేశ వ్యాప్తంగా 15 మంది హైకోర్టు జడ్జిల బదిలీ.. ఏపీకి ఇద్దరు, తెలంగాణకు ఒక్కరు