Covid Vaccine: తెలంగాణలో రేపటి నుంచి ఉచితంగా కొవిడ్ బూస్టర్ డోస్‌ వ్యాక్సిన్‌.. ఎవరెవరు అర్హులంటే..

|

Jan 09, 2022 | 7:54 PM

ఓవైపు విజృంభిస్తోన్న ఒమిక్రాన్‌.. మరోవైపు కుప్పలు తెప్పలుగా నమోదవుతోన్న కొవిడ్‌ కేసులు. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించిన

Covid Vaccine: తెలంగాణలో రేపటి నుంచి ఉచితంగా కొవిడ్ బూస్టర్ డోస్‌ వ్యాక్సిన్‌.. ఎవరెవరు అర్హులంటే..
Vaccine
Follow us on

ఓవైపు విజృంభిస్తోన్న ఒమిక్రాన్‌.. మరోవైపు కుప్పలు తెప్పలుగా నమోదవుతోన్న కొవిడ్‌ కేసులు. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రేపటి (జనవరి10) నుంచి ఉచితంగా ప్రికాషన్‌ డోసులు అందించేందుకు సిద్ధమైంది. తెలంగానలోనూ ఈ టీకా పంపిణీకి రంగం సిద్ధమైంది. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు రేపటి నుంచి ఉచితంగా ప్రికాషన్ డోస్‌ ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. వీరితో పాటు 60 ఏళ్ల పైబడి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ బూస్టర్‌ షాట్‌ ఇవ్వనున్నారు.

రిజిస్ట్రేషన్‌ ఎలాగంటే..
ఇప్పటికే కొవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారు ప్రికాషన్‌ డోస్ కోసం మళ్లీ కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ప్రికాషనరీ డోస్‌ టీకా షెడ్యూల్స్‌ ఇప్పటికే ఓపెన్‌ అయ్యాయి. నిన్నటి నుంచే ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అలాగే రేపటి(జనవరి 10) నుంచి నేరుగా వ్యాక్సినేషన్‌ సెంటర్‌‌కు వెళ్లి కూడా అపాయింట్‌మెంట్ బుక్‌ చేసుకోవచ్చు.

అర్హులెవరంటే..
ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ కార్మికులు, 60 ఏళ్లు (60 years) పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రికాషనరీ డోసు తీసుకునేందుకు అర్హులు.
నో మిక్సింగ్. వీరితో పాటు 60 ఏళ్లు పైబడి.. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, మూత్రపిండాల వ్యాధి, స్టెమ్ సెల్ మార్పిడి, సిర్రోసిస్, క్యాన్సర్ తదితర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి బూస్టర్‌ డోస్‌ తీసుకోవచ్చు.

నో మిక్సింగ్‌..
కాగా ఇప్పటికే కొవిడ్-19 రెండు డోసులకు సంబంధించి ఏ టీకా తీసుకున్నారో ప్రికాషన్‌ డోసు కూడా అదే కంపెనీకి సంబంధించిన టీకా ఇస్తారు. ప్రికాషన్‌ డోసులో వ్యాక్సిన్‌ల మిక్సింగ్‌ ఉండదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఉదాహరణకు ఇప్పటికే రెండు డోస్‌ల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకుని ఉంటే.. ప్రికాషన్‌ డోసు కూడా కోవిషీల్డ్‌నే అందిస్తారు. ఒకవేళ కోవాగ్జిన్ తీసుకుని ఉంటే అదే ఇస్తారు. అయితే రెండో డోసు పూర్తయి తొమ్మిది నెలలు గడిచిన వారు మాత్రమే ఈ బూస్టర్‌ షాట్‌ తీసుకోవాలి.

Also Read:

Mammootty: రీయూనియన్‌ పార్టీలో మలయాళ మెగాస్టార్‌.. క్లాస్‌మేట్స్‌తో దిగిన ఫొటోలు వైరల్..

Viral video: హరియాణా క్వీన్‌కు పోటీగా ముసలాయన హుషారైన స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

Coronavirus: ఏపీలో పెరుగుతోన్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కొత్త కేసులు నమోదయ్యాయంటే..