తమిళనాడులో కరోనా కేసుల తాజా వివరాలు ఇవే..
తమిళనాడులో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అయితే అదే సమయంలో కరోనా బాధితులు కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకోగలగుతున్నారు. తాజాగా.. శనివారం కొత్తగా మరో 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆరుగురు చిన్నారులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందరని అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1821కి చేరింది. ఇందులో ప్రస్తుతం 835 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. […]

తమిళనాడులో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అయితే అదే సమయంలో కరోనా బాధితులు కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకోగలగుతున్నారు. తాజాగా.. శనివారం కొత్తగా మరో 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆరుగురు చిన్నారులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందరని అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1821కి చేరింది. ఇందులో ప్రస్తుతం 835 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. ఇప్పటి వరకు కరోనా బారి నుంచి 960 మంది బయటపడ్డారు. వీరంతా కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడి చనిపోయిన వారి సంఖ్య 23కి చేరింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. నాలుగు సిటీల్లో లాక్‌డౌన్ ఓ నాలుగు రోజుల పాటు కఠినంగా చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.