AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా అల‌ర్ట్ః నెల్లూరులోని ప‌లు డివిజ‌న్ల‌లో క‌ర్ఫ్యూ మ‌రింత క‌ఠినం..

ఏపీ, తెలంగాణ‌కు చెందిన వారుకూడా ఉండ‌టంతో ఉన్న‌ట్టుండి ఊహించ‌ని ఉప్పెన ఎదురైన్న‌ట్లుగా ప‌రిస్థితి మారిపోయింది. ఈ నేప‌థ్యంలోనే నెల్లూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో క‌ర్ప్యూని మ‌రింత క‌ఠిన‌త‌రం చేశారు అధికారులు. ..

క‌రోనా అల‌ర్ట్ః నెల్లూరులోని ప‌లు డివిజ‌న్ల‌లో క‌ర్ఫ్యూ మ‌రింత క‌ఠినం..
Jyothi Gadda
|

Updated on: Mar 31, 2020 | 2:01 PM

Share
చాప‌కింద‌నీరులా విస్త‌రిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారి తెలుగు రాష్ట్రాల‌ను హ‌డ‌లెత్తిస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు కాస్త నెమ్మ‌దిగానే క‌నిపించిన కోవిడ్ భూతం..ఇవాళ ఒక్క‌సారిగా పంజావిసిరినంత ప‌నిచేసింది. ఢిల్లీ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిన‌ వారిలో చాలా మందికి వైర‌స్ పాజిటివ్‌గా తేల‌టం, వారిలో ఏపీ, తెలంగాణ‌కు చెందిన వారుకూడా ఉండ‌టంతో ఉన్న‌ట్టుండి ఊహించ‌ని ఉప్పెన ఎదురైన్న‌ట్లుగా ప‌రిస్థితి మారిపోయింది. ఈ నేప‌థ్యంలోనే నెల్లూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో క‌ర్ప్యూని మ‌రింత క‌ఠిన‌త‌రం చేశారు అధికారులు. పూర్తి వివ‌రాలు ప‌రిశీలించ‌గా…
నెల్లూరులో 43, 47 డివజన్లలో కర్ఫ్యూ విధించారు. ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఆ ప్రాంతానికి చెందిన వారు కూడా ఎక్కువ‌గానే ఉండ‌టం, వారిలో కొంత‌మందికి  క‌రోనా పాజిటివ్‌గా రావ‌టంతో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. నెల్లూరు జిల్లా నుంచి 70 మంది ఢిల్లీలో జరిగిన ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. వారందరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
నెల్లూరు పెద్దబజారు చేపల మార్కెట్ నుంచి కోటమిట్ట మీదుగా ములుమూడి బస్టాండ్ వరకు చిన్నబజారుని కలుపుకుని పూర్తిగా లాక్ డౌన్ చేశారు. కర్ఫ్యూ అమలులో వున్నట్లుగా కూడా చెబుతున్నారు. దీనివల్ల ఆ ప్రాంతంలో ఢిల్లీకి వెళ్ళివచ్చిన వారు ఎవరో కనుక్కుని వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. వారిని క్వారంటైన్ లో వుంచుతారు. ఆ తర్వాత వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, వారు ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరెవరిని కలిసింది తెలుసుకుని, వారిని కూడా పిలిపించి వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తారు. ఊహించ‌ని ప‌రిణామంతో నెల్లూరులో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెలకొంది.

Follow Us
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?