AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాతో ’అనంత‘ విలయం..8 మంది జర్నలిస్టులకు పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రజల్ని కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది.రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూ.. పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు..

కరోనాతో ’అనంత‘ విలయం..8 మంది జర్నలిస్టులకు పాజిటివ్
Jyothi Gadda
|

Updated on: Jul 02, 2020 | 4:20 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రజల్ని కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూ.. పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు చాలా మంది వైరస్ బారినపడుతుండగా, మీడియా సిబ్బందికి కూడా చాలా మందికి కోవిడ్ సోకినట్లు తెలుస్తోంది.

అనంతపురం జిల్లాలో ఎనిమిది మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. కరోనా సోకిన జర్నలిస్టులను తక్షణమే ఆదుకోవాలని ఏపీ డబ్ల్యూజే డిమాండ్ చేసింది. కరోనా బారిన పడిన జర్నలిస్టులకు మెరుగైన వైద్య సాయం అందించడమే కాకుండా, వారందరికీ వెంటనే రూ.20వేలు ఆర్థిక సాయం అందించాలని కోరింది. ఈ మేరకు జర్నలిస్టు సంఘం నాయకులు మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి వినతి పత్రం అందించారు. జర్నలిస్టు సంఘం నేతల వినతికి వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, ఏపీలో కొత్త‌గా గురువారం(జూలై2న) 845 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.14,285 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 845 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైరస్ కారణంగా మరో ఐదుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 16,097కు చేరింది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 198కి చేరింది.

Follow Us
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
పెళ్లి తర్వాత మీ ఫోన్ నుంచి వీటిని తొలగించకుంటే ఇబ్బందులు తప్పవు!
పెళ్లి తర్వాత మీ ఫోన్ నుంచి వీటిని తొలగించకుంటే ఇబ్బందులు తప్పవు!
ఏడాదిలో ఓసారి, వారంలో 2సార్లు, నెలలో 11సార్లు వచ్చేది: UPSCప్రశ్న
ఏడాదిలో ఓసారి, వారంలో 2సార్లు, నెలలో 11సార్లు వచ్చేది: UPSCప్రశ్న
40 ఏళ్లు వచ్చాయా? ఈ 7 మార్పులు కనిపిస్తే జాగ్రత్త పడండి!
40 ఏళ్లు వచ్చాయా? ఈ 7 మార్పులు కనిపిస్తే జాగ్రత్త పడండి!
శుక్రవారం టీవీలో సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
శుక్రవారం టీవీలో సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
పనీర్ మఖ్మాలి.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
పనీర్ మఖ్మాలి.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
స్కూల్‌ పక్కనుంచి వెళ్లిన వినాయక ఊరేగింపు.. కట్‌చేస్తే..
స్కూల్‌ పక్కనుంచి వెళ్లిన వినాయక ఊరేగింపు.. కట్‌చేస్తే..
తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్షసూచన.. వాతావరణశాఖ హెచ్చరిక..
తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్షసూచన.. వాతావరణశాఖ హెచ్చరిక..
ధర వింటే కళ్లు తిరగాల్సిందే.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థాలివే
ధర వింటే కళ్లు తిరగాల్సిందే.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థాలివే
విద్యార్ధులకు అలర్ట్.. అక్టోబర్‌ 9 నుంచే స్కూళ్లకు దసరా సెలవులు!
విద్యార్ధులకు అలర్ట్.. అక్టోబర్‌ 9 నుంచే స్కూళ్లకు దసరా సెలవులు!