ఏడాదిలో కరోనా వ్యాక్సీన్ .. మా టార్గెట్..200 కోట్ల డోసులు..ప్రపంచ ఆరోగ్య సంస్థ

2021 నాటికి కరోనా వ్యాక్సీన్ ..కోవ్యాగ్జిన్ 200 కోట్ల డోసులు కావాలన్నది తమ లక్ష్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ క్షేత్ర పాల్ సింగ్ తెలిపారు. ప్రపంచ దేశాల్లో వేర్వేరు టెక్నాలజీలతో వివిధ రకాల..

ఏడాదిలో కరోనా వ్యాక్సీన్ .. మా టార్గెట్..200 కోట్ల డోసులు..ప్రపంచ ఆరోగ్య సంస్థ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 29, 2020 | 1:24 PM

2021 నాటికి కరోనా వ్యాక్సీన్ ..కోవ్యాగ్జిన్ 200 కోట్ల డోసులు కావాలన్నది తమ లక్ష్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ క్షేత్ర పాల్ సింగ్ తెలిపారు. ప్రపంచ దేశాల్లో వేర్వేరు టెక్నాలజీలతో వివిధ రకాల వ్యాక్సీన్లు తయారవుతున్నాయని, అయితే ఇవి ఎంతవరకు మంచి ఫలితాలను ఇస్తాయన్నది పరిశీలించవలసి ఉంటుందని ఆమె అన్నారు. ఈ పరిశోధనలన్నీ పూర్తి అయ్యేవరకు వేచి ఉండాల్సిందే అని పేర్కొన్నారు. 2021 నాటికి 200 కోట్లు..లేదా అంతకన్నా ఎక్కువగానే కోవాగ్జిన్ డోసులు  ఉత్పత్తి కావచ్ఛు..  పైగా ఈ దిశగా పలు దేశాలు జరుపుతున్న క్లినికల్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నాయి అని పూనమ్ వెల్లడించారు.

భారీ ఎత్తున ఈ వ్యాక్సీన్ ని ఉత్పత్తి చేస్తున్న ప్రపంచ దేశాల్లో ఇండియా ఒకటని, ఈ వరల్డ్ లోనే ఆ దేశాన్ని ఓ ‘ఫార్మసీ’గా వ్యవహరించవచ్చునని ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. గ్లోబల్ గా వ్యాక్సీన్ ని తయారు చేస్తున్న దేశాల్లో ఇండియా కీలక పాత్ర వహిస్తుంది.. అది నిస్సందేహం..అని పూనమ్ క్షేత్ర పాల్ సింగ్ పేర్కొన్నారు. వివిధ దేశాలతో తమ సంస్థ  ఎప్పటికప్పుడు దీని పురోగతి గురించి తెలుసుకుంటోందన్నారు.