ప్రజలందరికీ అలర్ట్. న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ పలికేందుకు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసుకోవచ్చు, నైట్ పార్టీ కోసం అంతకు మించి ఏర్పాట్లు ఉండొచ్చు. కానీ అంతకంటే ముందు మీరు ఈ సమాచారం తెలుసుకోవాలి. గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసులెన్నో తెలుసా. అందులో ఒమిక్రాన్ ఎన్నో తెలుసా. ఈ సమాచారం తెలుసుకంటే.. మీరు ఒకింత షాక్‌కు గురి కావాల్సిందే.
చాలా రోజుల తర్వాత దేశంలో కరోనా కేసులు బీభత్సంగా పెరిగాయి. కొత్త కేసులు 16 వేల 764 నమోదు కాగా.. అందులో 1270 ఒమిక్రాన్ వేరియంట్లు. దేశంలో తొలిసారి ఒమిక్రాన్ కేసులు వెయ్యి దాటాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 220 మంది ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 450 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీలో 320 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1270 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలను బయటపెట్టింది. ఇప్పటికే వణికిస్తున్న ఒమిక్రాన్.. తొలిసారి ఒక్కరోజులో వెయ్యి దాటాయి.
దేశంలో వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం మరో 66,65,290 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,44,54,16,714 కు చేరింది.
Also Read: Viral: నదిలో బాంబులు పేల్చుతున్న యువకులు.. ఎందుకో తెలిస్తే షాక్ తింటారు
Telugu Heroine: బుర్ఖాలో థియేటర్‌కి వెళ్లి సినిమా చూసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తించారా..?