AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వుహన్‌లో మరోసారి అలజడి.. గాలిలో కరోనా జాడలు..

కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని ఈ మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతోంది. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తి గురించి ఇప్పటివరకు అనేక వార్తలు సోషల్ మీడియాలో హాల్‌చల్‌ చేశాయి. కొందరు గాలి ద్వారా వ్యాపిస్తుందని అంటే.. మరికొందరు ప్రత్యక్ష తాకిడితోనే వస్తుందని చెప్పారు. ఇలాంటి తరుణంలో కరోనా పుట్టినిల్లు వుహన్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. అక్కడ స్థానికంగా ఉండే ఆసుపత్రుల్లో ఇప్పటికీ కూడా కరోనా వైరస్ జాడలు ఉన్నట్లు […]

వుహన్‌లో మరోసారి అలజడి.. గాలిలో కరోనా జాడలు..
Ravi Kiran
|

Updated on: May 02, 2020 | 8:51 PM

Share

కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని ఈ మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతోంది. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తి గురించి ఇప్పటివరకు అనేక వార్తలు సోషల్ మీడియాలో హాల్‌చల్‌ చేశాయి. కొందరు గాలి ద్వారా వ్యాపిస్తుందని అంటే.. మరికొందరు ప్రత్యక్ష తాకిడితోనే వస్తుందని చెప్పారు. ఇలాంటి తరుణంలో కరోనా పుట్టినిల్లు వుహన్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి.

అక్కడ స్థానికంగా ఉండే ఆసుపత్రుల్లో ఇప్పటికీ కూడా కరోనా వైరస్ జాడలు ఉన్నట్లు గుర్తించారు. వుహన్ నగరంలోని రెండు ఆసుపత్రుల గాలిలోని తుంపర్లలో కరోనాను గుర్తించినట్లు నేచర్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీనితో మరోసారి వుహన్‌లో అలజడి రేగింది. అయితే నివాస ప్రాంతాల్లోని గాలిలో మాత్రం ఎటువంటి వైరస్ జాడ కనిపించలేదని తెలుస్తోంది. కాగా, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వుహన్‌లోని రెన్మిన్ ఆసుపత్రితో పాటు కరోనా బాధితులను క్వారంటైన్ చేసిన తాత్కాలిక కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు గాలి నమూనాలను సేకరించారు.

అంతేకాకుండా జనాలు నివాసం ఉండే ప్రాంతాల నుంచి కూడా గాలి నమూనాలను తీసుకున్నారు. వాటన్నింటిని విశ్లేషించిన తర్వాత ఆసుపత్రులు మినహాయించి మిగిలిన అన్ని చోట్లు సురక్షితంగా ఉన్నాయని తేల్చారు. గాలి నమూనాలు తప్పితే మరెక్కడా కూడా కరోనా జాడ కనిపించట్లేదు అట. అన్ని చోట్ల సురక్షితం అని గుర్తించారు. మరోవైపు ఆసుపత్రుల్లో జనం ఎక్కువగా గుమిగూడే ఐసోలేషన్ వార్డులు, బాధితుల గదులు, బాత్రూమ్‌ల గాలిలో అత్యల్ప స్థాయిలో వైరస్ జాడలు ట్రేస్ అయినట్లు పరిశోధకులు తెలుసుకున్నారు. మరి ఈ గాలిలో ఉన్న కరోనా వైరస్ ఎంతమేరకు ప్రభావం చూపుతున్నది వెల్లడి కాలేదు.

Read More:

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కార్డుదారులకు 30 కిలోల ఉచిత బియ్యం..

షాకింగ్: సీఎం సెక్యూరిటీలో ముగ్గురికి కరోనా పాజిటివ్…

మసీదులో సామూహిక ప్రార్ధనలు.. అంతలోనే మహిళా తహశీల్దార్ ఎంట్రీ.. ఏం జరిగిందంటే.!

గ్రేటర్‌లో కరోనా టెర్రర్.. పల్లీల వ్యాపారి ద్వారా ఏకంగా..

గుడ్ న్యూస్.. దేశంలో 10 వేల మంది కరోనాను జయించారు.

కర్నూలులో దారుణం..మహిళ ప్రాణం తీసిన రెడ్‌జోన్‌ ఆంక్ష‌లు..

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..