AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ కరోనా బులిటెన్.. ఒక్క రోజులో ఎన్ని కేసులంటే.!

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1267 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,52,455కి చేరింది.

తెలంగాణ కరోనా బులిటెన్.. ఒక్క రోజులో ఎన్ని కేసులంటే.!
Ravi Kiran
|

Updated on: Nov 10, 2020 | 9:18 AM

Share

Coronavirus Positive Cases In Telangana: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1267 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,52,455కి చేరింది. ఇందులో 18,581 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,32,489 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 1,831 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 4 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1385కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 42,490 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 46,84,766కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 85, జీహెచ్ఎంసీ 201, జగిత్యాల 23, జనగాం 17, జయశంకర్ భూపాలపల్లి 15, గద్వాల్ 5, కామారెడ్డి 23, కరీంనగర్ 53, ఖమ్మం 62, ఆసిఫాబాద్ 10, మహబూబ్ నగర్ 23, మహబూబాబాద్ 15, మంచిర్యాల 32, మెదక్ 21, మేడ్చల్ 109, ములుగు 23, నాగర్ కర్నూల్ 32, నల్గొండ 89, నారాయణపేట 3, నిర్మల్ 18, నిజామాబాద్ 40, పెద్దపల్లి 30, రాజన్న సిరిసిల్ల 23, రంగారెడ్డి 104, సంగారెడ్డి 20, సిద్ధిపేట 27, సూర్యాపేట 42, వికారాబాద్ 16, వనపర్తి 17, వరంగల్ రూరల్ 14, వరంగల్ అర్బన్ 45, యదాద్రి భోనగిరిలో 24 కేసులు నమోదయ్యాయి.