AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచవ్యాప్తంగా 17 మిలియన్లకు చేరువలో కరోనా కేసులు..

ప్రపంచవ్యాప్తంగా 16,959,858 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 664,664 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 10,508,350 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా 17 మిలియన్లకు చేరువలో కరోనా కేసులు..
Ravi Kiran
|

Updated on: Jul 29, 2020 | 8:32 PM

Share

Corona Cases In World: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 16,959,858 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 664,664 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 10,508,350 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో అత్యధికంగా 2,47,592 పాజిటివ్ కేసులు, 5568 మరణాలు సంభవించాయి. అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(4,501,219), మరణాలు(152,410) సంభవించాయి. ఇక భారత్‌లో కరోనా కేసులు 1,558,447 నమోదు కాగా, మృతుల సంఖ్య 34,485కి చేరింది.

Also Read:

అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా సమాచారానికి ప్రత్యేక వాట్సాప్ నెంబర్లు

Breaking: అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను ప్రకటించిన కేంద్రం

Follow Us