AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తస్మాత్ జాగ్రత్త…కరోనా వైరస్ కొత్త లక్షణం..కండ్లకలకతో

కోవిడ్-19 విజృంభణ రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. వైరస్ ప్రతాపంతో ఇప్పటికే ముప్పుతిప్పలు ఎదుర్కొంటున్న తరుణంలో కరోనా వైరస్ లక్షణాల్లో మరో కొత్త లక్షణం వచ్చి చేరింది. కనీసం జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఏవీ లేకపోయినా ..

తస్మాత్ జాగ్రత్త...కరోనా వైరస్ కొత్త లక్షణం..కండ్లకలకతో
Jyothi Gadda
|

Updated on: Jun 19, 2020 | 6:33 PM

Share

కోవిడ్-19 విజృంభణ రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. వైరస్ ప్రతాపంతో ఇప్పటికే ముప్పుతిప్పలు ఎదుర్కొంటున్న తరుణంలో కరోనా వైరస్ లక్షణాల్లో మరో కొత్త లక్షణం వచ్చి చేరింది. ఇప్పటి వరకు ఈ జాబితాలో తొమ్మిది లక్షణాలు.. జ్వరం, దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కఫము, కండరాల నొప్పి, ముక్కు కారడం, గొంతుమంట, విరేచనాలు, అనోస్మియా (వాసన లేమి), ఎగూసియా (రుచిని తెలుసుకోలేకపోవడం) వంటి లక్షణాలు ఉండగా, తాజాగా కోవిడ్-19 ప్రాథమిక లక్షణాల్లో మరో కొత్త లక్షణాన్ని పరిశోధకులు గుర్తించారు. కండ్లకలక కూడా కరోనా లక్షణాల్లో ఒకటిగా పరిశోధకులు గుర్తించారు. ఈ మేరకు కెనడియన్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీలో కథనాన్ని ప్రచురించారు.

టోరంటో లో గత మార్చి నెలలో ఓ 29 ఏళ్ల మహిళ తీవ్రమైన కళ్లకలక సమస్యతో రాయల్ అలెక్సాండ్రా ఆస్పత్రికి చెందిన ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అల్బెర్టాకి వచ్చింది. కళ్లకలకతో పాటు ఆమెకు కొద్దిమేర ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. డాక్టర్లు ఆమెకు కొద్ది రోజులపాటు చికిత్స అందించిన తర్వాత కూడా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. ఈ క్రమంలోనే ఆమె ట్రావెల్ హిస్టరీని తెలుసుకున్న వైద్యులు..ఆమె ఇటీవల ఆసియా నుంచి తిరిగి వచ్చినట్టు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చిన ఓ వైద్యుడు కరోనా టెస్ట్ చేయించాలని సూచించాడు. దీంతో ఆమెకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.

అయితే, ఈ కేసులో మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆమె అస్వస్థతకు గురైనట్టు కనిపించిన ప్రధాన లక్షణాల్లో శ్వాసకోశ సమస్య అంతగా లేదు. కళ్లకలకే ప్రధాన లక్షణంగా ఉన్నట్టు గుర్తించామని అక్కడి వైద్యులు వెల్లడించారు. కనీసం జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఏవీ లేకపోవడంతో కొవిడ్-19 అన్న సందేహం తమకు రాలేదన్నారు.  కరోనా మహమ్మారిపై ఇటీవల వెలువడిన పలు అధ్యయనాల్లో.. దాదాపు 10 నుంచి 15 శాతం మంది కొవిడ్-19 పేషెంట్లకు కండ్లకలక ద్వితీయ ప్రాథమిక లక్షణంగా పలు నివేదికల ద్వారా వెల్లడైదని పరిశోధకులు స్పష్టం చేశారు.