AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“పీఎం కేర్‌ ఫండ్‌”కి LIC విరాళం.. ఎంత ఇచ్చిందంటే..?

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో వణికిపోతున్న విషయం తెలిసింది. తాజాగా ఈ మహమ్మారి గత నెల రోజుల నుంచి మన దేశంలో కూడా విళయ తాండవం చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం అందించాలని.. ప్రధాని మంత్రి కేర్ ఫండ్‌ కు విరాళాలంద జేయాలని ప్రధని మోదీ సూచించారు. ఈ నేపథ్యంలో అనేక […]

పీఎం కేర్‌ ఫండ్‌కి LIC విరాళం.. ఎంత ఇచ్చిందంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 31, 2020 | 10:11 PM

Share

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో వణికిపోతున్న విషయం తెలిసింది. తాజాగా ఈ మహమ్మారి గత నెల రోజుల నుంచి మన దేశంలో కూడా విళయ తాండవం చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం అందించాలని.. ప్రధాని మంత్రి కేర్ ఫండ్‌ కు విరాళాలంద జేయాలని ప్రధని మోదీ సూచించారు. ఈ నేపథ్యంలో అనేక మంది వారి వారి స్థాయికి తగ్గట్లుగా విరాళాలు పంపిస్తున్నారు. కార్పోరేట్ సంస్థలతో పాటు.. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ప్రధాని మోదీ కేర్ ఫండ్‌కు భారీ విరాళాలను అందజేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్యూరెన్స్ కార్పోరేషన్ (ఎల్ఐసీ) కూడా పీఎం కేర్ ఫండ్‌కు రూ.105 కోట్ల విరాళాన్ని అందజేసింది. ఇందులో రూ.5 కోట్లు ఎల్ఐసీ గోల్డెన్ జుబ్లీ ఫండ్‌గా పేర్కొంది.