Breaking: తెలంగాణలో కొత్తగా మరో 18 కేసులు.. 858కి చేరిన సంఖ్య..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదహారు వేలకు పైగా కేసులు నమోదవ్వగా.. మృతుల సంఖ్య 500 దాటింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 858కు చేరాయి. ఈరోజు కొత్తగా 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా మహమ్మారి వల్ల మొత్తం 21 […]

Breaking: తెలంగాణలో కొత్తగా మరో 18 కేసులు.. 858కి చేరిన సంఖ్య..

Updated on: Apr 19, 2020 | 9:25 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదహారు వేలకు పైగా కేసులు నమోదవ్వగా.. మృతుల సంఖ్య 500 దాటింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 858కు చేరాయి. ఈరోజు కొత్తగా 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా మహమ్మారి వల్ల మొత్తం 21 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 651 యాక్టివ్ కేసులు ఉన్నాయని… 186 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ఇక లాక్‌డౌన్ దేశ వ్యాప్తంగా మే 3వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అటు తెలంగాణలో ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు కాలేదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. వరంగల్ రూరల్, యదాద్రి, భువనగిరి, వనపర్తి, సిద్ధిపేటలలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని అన్నారు. కాగా, కేంద్రం రేపటి నుంచి విధించిన సడలింపులు రాష్ట్రంలో ఉండవని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో లాక్ డౌన్ మే 7 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.

Also Read:

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..

వలస కార్మికులకు ఊరట.. కేంద్రం కీలక నిర్ణయం..

ఈ కామర్స్ సంస్థలకు షాక్.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన కేంద్రం

‘దేశద్రోహుల పట్ల నేనింతే’.. అఫ్రిదీకి గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్..

Breaking: మే 7 వరకు తెలంగాణలో స్విగ్గీ, జోమాట బ్యాన్…