తన కారును రోడ్డుపై ఆపినందుకు ఓ యువతి నడిరోడ్డుపై హల్చల్ చేసింది. దేశం మొత్తం లాక్‌డౌన్ చేస్తే.. బయట ఎందుకు తిరుగుతున్నారంటూ ప్రశ్నించిన పోలీసుల మీద ఆ యువతి వీరంగం సృష్టించింది. పోలీసులతో గొడవ పెట్టుకోవడమే కాకుండా.. ఏకంగా ఓ పోలీస్ ఆఫీసర్ చేతిని కొరికింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలో నిర్మానుష్యంగా ఉన్న ఓ రోడ్డు మీద క్యాబ్ వస్తుండడంతో చూసి పోలీసులు ఆపారు. ఈ సమయంలో బయట ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. తాము మెడిసిన్స్ తీసుకురావడానికి వచ్చామన్నారు. ప్రిస్కిప్షన్ అడిగితే లేదన్నారు. ఇంతలో కారులో కూర్చున్న ఓ యువతి బయటకు వచ్చి వారితో వాగ్వాదానికి దిగింది. ఆమె వెంట ఉన్న ఓ యువకుడు కూడా బయటకు వచ్చి పోలీసులతో గొడవకు దిగాడు. ఇంతలో ఆ యువతి మరింత క్రూరంగా రెచ్చిపోయి.. అక్కడ ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ చేయి కొరికేసింది. అక్కడితో ఆగిపోకుండా.. గతంలో యువతికి తగిన దెబ్బను గిచ్చి.. అక్కడ వచ్చిన రక్తాన్ని.. పోలీస్ ఆఫీసర్ డ్రెస్ మీద వేసింది. అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినా.. ఆ తరువాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.
WTF this DESPICABLE Woke #COVIDIOT when stopped by police abused & spit on Kolkata Police Cop ?? #COVIDIDIOTS #COVIDIOTS #coronavirusindia #21daylockdown pic.twitter.com/Q1P8RcVtZw
— Rosy (@rose_k01) March 25, 2020
ఇవి కూడా చదవండి:
కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం
కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్
సీఎం సహాయ నిధికి.. విరాళంగా ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు
ఎక్కడైనా రేట్లు పెంచారా.. ఈ నెంబర్‌కి ఒక్క కాల్ చేస్తే.. తిక్క కుదురుస్తారు
కరోనా నివారణకు.. తెలంగాణలో స్టెరిలైజేషన్..
బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. బట్టలు ఉతుకుతున్న క్రికెటర్