ఏపీ బోర్డర్‌లో ఆగిపోయిన వారికి అనుమతి.. ఇకపై కుదరదు

దేశవ్యాప్తంగానే కాకుండా.. ఇరు తెలుగు రాష్ట్రాలనూ ఏప్రిల్ 15వ తేదీ వరకూ లాక్‌డౌన్ చేశారు. దీంతో.. ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ నగరంలో హాస్టళ్లలలో ఉండే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. హాస్టళ్లన్నీ మూసివేయండంతో.. ఒక్కసారిగా చాలా మంది యువతీ, యవకులు..

ఏపీ బోర్డర్‌లో ఆగిపోయిన వారికి అనుమతి.. ఇకపై కుదరదు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 26, 2020 | 7:29 AM

దేశవ్యాప్తంగానే కాకుండా.. ఇరు తెలుగు రాష్ట్రాలనూ ఏప్రిల్ 15వ తేదీ వరకూ లాక్‌డౌన్ చేశారు. దీంతో.. ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ నగరంలో హాస్టళ్లలలో ఉండే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. హాస్టళ్లన్నీ మూసివేయండంతో.. ఒక్కసారిగా చాలా మంది యువతీ, యవకులు ఏపీకి పయనమయ్యారు. అందులోనూ బస్సులు, ట్రైన్లు బంద్ చేయడంతో హైదరాబాద్ నుంచి వేలాది మంది కార్లు, బండ్ల మీద ఏపీలోని తమ సొంత ఊళ్లకు బయలు దేరారు. దీంతో వారందర్నీ జగ్యయ్యపేట ప్రాంతం వద్ద ఆపేశారు. సర్టిఫికేట్ ఉన్నా పంపించేంది లేదని అధికారులు వారిని అక్కడే నిలిపివేశారు.

దీంతో ఎటు వెళ్లాల్లో తెలీక చాలా సేపు రోడ్డుపైనే నరకం అనుభవించారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌తో.. ఏపీ సీఎం జగన్ సంప్రదింపులు జరపగా.. జగ్గయ్యపేట రోడ్డుపై నిలిచిపోయిన వారిని ఏపీలోకి అనుమతించారు అధికారులు. ఇకపై హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చినా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్ల వారికాక.. వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా రిస్క్‌లో పెట్టినవాళ్లవుతారని అధికారులు తెలిపారు. కోవిడ్-19 నివారణలో భాగంగా ప్రస్తుతం ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఏపీ అధికారులు కోరారు.

ఇవి కూడా చదవండి: 

కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

సీఎం సహాయ నిధికి.. విరాళంగా ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు

ఎక్కడైనా రేట్లు పెంచారా.. ఈ నెంబర్‌కి ఒక్క కాల్ చేస్తే.. తిక్క కుదురుస్తారు

కరోనా నివారణకు.. తెలంగాణలో స్టెరిలైజేషన్..

బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. బట్టలు ఉతుకుతున్న క్రికెటర్

లాక్‌డౌన్ టైంలో బరువు పెరగకుండా ఇలా కేర్ తీసుకోండి..

వాట్సాప్ బంద్ కావడంలేదు.. ఆ ఫేక్ వార్తలను నమ్మకండి..