లాక్‌డౌన్‌ నుంచి వీటికి కూడా మినహాయింపు.. కేంద్రం తాజా ఆదేశాలు..

కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ నుంచి మరికొన్నింటికి మినహాయింపు ఇస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలోనే విత్తనాలు, ఉద్యాన ఉత్పత్తులు, పరిశోధనా సంస్థలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే స్కూల్ బుక్స్, ఎలక్ట్రానిక్ ఫ్యాన్స్‌కు సంబంధించిన షాపులు కూడా లాక్ డౌన్ నుంచి మినహాయించినట్లు స్పష్టం చేసింది. మరోవైపు పట్టణాల్లోని బ్రెడ్ ఫ్యాక్టరీలు, మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, బియ్యం మిల్లులు, పప్పు మిల్లులతో పాటు ప్రీపెయిడ్ మొబైళ్లకు రీచార్జ్ చేసే […]

లాక్‌డౌన్‌ నుంచి వీటికి కూడా మినహాయింపు.. కేంద్రం తాజా ఆదేశాలు..

Updated on: Apr 22, 2020 | 10:32 AM

కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ నుంచి మరికొన్నింటికి మినహాయింపు ఇస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలోనే విత్తనాలు, ఉద్యాన ఉత్పత్తులు, పరిశోధనా సంస్థలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే స్కూల్ బుక్స్, ఎలక్ట్రానిక్ ఫ్యాన్స్‌కు సంబంధించిన షాపులు కూడా లాక్ డౌన్ నుంచి మినహాయించినట్లు స్పష్టం చేసింది.

మరోవైపు పట్టణాల్లోని బ్రెడ్ ఫ్యాక్టరీలు, మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, బియ్యం మిల్లులు, పప్పు మిల్లులతో పాటు ప్రీపెయిడ్ మొబైళ్లకు రీచార్జ్ చేసే పాయింట్లకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను మూసివేస్తే.. ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉండటం వల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, కేంద్రం అమలు చేసిన లాక్ డౌన్ మే 3 వరకు ఉండగా.. తెలంగాణలో మాత్రం లాక్ డౌన్ మే 7 వరకు కొనసాగనుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఎటువంటి సడలింపులు ఇవ్వట్లేదని సీఎం కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు.

Also Read:

కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

మనసున్న మారాజు.. పేదవాళ్లకు అద్దె మాఫీ చేసిన టీఆర్ఎస్ నేత..

కరోనా కాలంలో జగన్ మరో కీలక నిర్ణయం..

గుడ్ న్యూస్.. ఫలించిన ప్లాస్మా థెరపీ.. కోలుకున్న కరోనా బాధితుడు..

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న మద్యం షాపులు.. కానీ..

Follow Us