గుడ్ న్యూస్.. ఫలించిన ప్లాస్మా థెరపీ.. కోలుకున్న కరోనా బాధితుడు..

యావత్ ప్రపంచంతో పాటు మన దేశాన్ని కూడా పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను నివారించడంలో భాగంగా ప్రవేశపెట్టిన ప్లాస్మా థెరపీ మంచి ఫలితాల్ని ఇస్తోంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఢిల్లీలో తొలి విజయం నమోదైంది. వారం క్రితం దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయిల్స్ ప్రారంభం కాగా.. ఇప్పటికే ఈ చికిత్స ద్వారా ఓ కరోనా బాధితుడు పూర్తిగా కోలుకున్నాడు. Also Read: ముస్లిం సోదరులకు పాక్ ప్రధాని గుడ్ న్యూస్.. ప్రార్ధనలకు గ్రీన్ సిగ్నల్.. కరోనా వైరస్ […]

గుడ్ న్యూస్.. ఫలించిన ప్లాస్మా థెరపీ.. కోలుకున్న కరోనా బాధితుడు..
Follow us

|

Updated on: Apr 21, 2020 | 10:12 AM

యావత్ ప్రపంచంతో పాటు మన దేశాన్ని కూడా పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను నివారించడంలో భాగంగా ప్రవేశపెట్టిన ప్లాస్మా థెరపీ మంచి ఫలితాల్ని ఇస్తోంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఢిల్లీలో తొలి విజయం నమోదైంది. వారం క్రితం దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయిల్స్ ప్రారంభం కాగా.. ఇప్పటికే ఈ చికిత్స ద్వారా ఓ కరోనా బాధితుడు పూర్తిగా కోలుకున్నాడు.

Also Read: ముస్లిం సోదరులకు పాక్ ప్రధాని గుడ్ న్యూస్.. ప్రార్ధనలకు గ్రీన్ సిగ్నల్..

కరోనా వైరస్ సోకిన సదరు పేషంట్ ఢిల్లీలోని సాకేత్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే డాక్టర్లు అతడికి ప్లాస్మా థెరపీని అందించారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మాతో అతడికి చికిత్స చేశారు. ఊహించని రీతిలో అది ఫలితాన్ని ఇవ్వడంతో అతడు పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అతడికి అమర్చిన వెంటిలేటర్‌ను డాక్టర్లు తొలగించారు. కాగా, వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేస్తే మంచి ఫలితాలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

Also Read:కరోనా వేళ.. కర్నూలులో కోతులు మృతి.. భయాందోళనలో ప్రజలు..