సాహో ఇండియా.. భారతీయ డాక్టర్‌కు సలాం చేసిన అమెరికన్లు.. వీడియో వైరల్..

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో దానిని కట్టడి చేసేందుకు వైద్యులు రాత్రింబవళ్ళు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇంతటి సేవ చేస్తున్న వాళ్లను కాపాడాల్సింది పోయి.. కొంతమంది వ్యక్తులు దాడులు చేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే అమెరికాలోని ఓ భారతీయ డాక్టర్‌కు సరికొత్త అనుభవం దక్కింది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని సౌత్ విండ్‌స్టర్‌ ఆసుపత్రిలో కరోనా రోగులకు భారతీయ వైద్యురాలు ఉమ మధుసూధన్ […]

  • Ravi Kiran
  • Publish Date - 1:40 pm, Wed, 22 April 20
సాహో ఇండియా.. భారతీయ డాక్టర్‌కు సలాం చేసిన అమెరికన్లు.. వీడియో వైరల్..

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో దానిని కట్టడి చేసేందుకు వైద్యులు రాత్రింబవళ్ళు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇంతటి సేవ చేస్తున్న వాళ్లను కాపాడాల్సింది పోయి.. కొంతమంది వ్యక్తులు దాడులు చేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే అమెరికాలోని ఓ భారతీయ డాక్టర్‌కు సరికొత్త అనుభవం దక్కింది.

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని సౌత్ విండ్‌స్టర్‌ ఆసుపత్రిలో కరోనా రోగులకు భారతీయ వైద్యురాలు ఉమ మధుసూధన్ సేవలు అందిస్తోంది. స్థానిక వ్యక్తీ కాకపోయినా తన ప్రాణాలను పణంగా పెట్టి కరోనా నుంచి కాపాడుతున్న డాక్టర్ ఉమకు అక్కడి అమెరికన్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె ఇంటి ముందు ఏకంగా 50 వాహనాలతో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్తా వైరల్ అయింది. అమెరికా, యూరోప్ ఖండాల్లో మన వైద్యులకు ఎక్కువ గౌరవం ఇస్తుంటారు. ఏది ఏమైనా కరోనాపై యుద్ధంలో మనల్ని ముందు నుంచి నడిపిస్తున్న డాక్టర్లను గౌరవిద్దాం.. వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపుదాం.

Also Read:

కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

మనసున్న మారాజు.. పేదవాళ్లకు అద్దె మాఫీ చేసిన టీఆర్ఎస్ నేత..

లాక్‌డౌన్‌ నుంచి వీటికి కూడా మినహాయింపు.. కేంద్రం తాజా ఆదేశాలు..

లాక్‌డౌన్‌ బేఖాతర్.. వందల సంఖ్యలో గుమిగూడి కరోనా పూజలు..

అక్కడ లాక్ డౌన్ పాటించకపోతే.. రూ. 23,000 ఫైన్…

పాఠశాలలకు సెలవులు పొడిగించిన ఏపీ ప్రభుత్వం..

లాక్‌డౌన్ వేళ.. ఎయిర్ అంబులెన్స్‌లో తొలిసారి భారత్‌కు..